మెగా అల్లుడా మ‌జాకానా?

Last Updated on by

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్‌దేవ్ హీరోగా న‌టించిన విజేత త్వ‌ర‌లో రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వ ంలో వారాహి చ‌ల‌న‌చిత్రం సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా క‌థ ఓకే చెప్ప‌డం నుంచి ప్ర‌తిదీ మెగాస్టార్ ద‌గ్గ‌రుండి ఎంతో జాగ్ర‌త్త వ‌హించారు. క‌ళ్యాణ్‌కి పిల్ల‌నివ్వ‌డ‌మే గాకుండా హీరోగా కెరీర్‌ని సెట్ చేస్తున్నారిపుడు. ఆ క్ర‌మంలోనే నిన్న‌టిరోజున ఆడియో వేడుక‌లో అల్లుడిని మెగాస్టార్ ఓ రేంజులో ఆకాశానికెత్తేశారు.

మెగాస్టార్ మాట్లాడుతూ -“క‌ల్యాణ్ దేవ్‌.. కెప్టెన్ కిష‌న్‌.. బిజినెస్‌మేన్ కొడుకైనా.. బిజినెస్ వైపు వెళ్ల‌కుండా త‌న‌కు చిన్న‌ప్ప‌ట్నుంచి న‌ట‌న‌పై ఉన్న ఆస‌క్తి గురించి నాకు చెప్పాడు. అప్పుడు నేను చెప్పింది ఒక‌టే. మనం ఎంత క‌ష్ట‌ప‌డుతున్నాం.. మ‌న‌మేం ఇస్తున్నాం అన్న‌దే ముఖ్యమ‌ని చెప్పాను. త‌న‌కు ముఖ‌వ‌ర్చ‌స్సు బావుంది. గ్లామ‌ర్ అన్నీ ఉన్నాయి. త‌న‌లో జోష్‌, త‌ప‌న ఉన్నాయా? లేవా? అనేది కూడా ముఖ్య‌మేన‌ని చెప్పాను. న‌ట‌శిక్ష‌ణ తీసుకోమ‌ని స‌ల‌హా ఇచ్చాను. నా స‌ల‌హా మేర స‌త్యానంద్ వ‌ద్ద ట్రైనింగ్ తీసుకున్నాడు. త‌న‌లోని లోపాల‌ను స‌రి చేసుకుని ఎమోష‌నల్ సీన్స్‌లో ప‌రిణితి చెందిన న‌టుడిగా క‌నిపించాడు… న‌ట‌న‌లో శ‌భాష్ అనిపించాడు. డాన్స్‌లో బాగా రాణించాడు. సీనియ‌ర్‌ న‌టుల‌తో క‌ల్యాణ్ చేయ‌డం ల‌క్కీ. జూలై 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మా ఫ్యామిలీకి చెందిన సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తేజ్ చిత్రం జూన్ 6న విడుద‌ల‌వుతుంది. అదే డేట్‌కి ఈ సినిమా విడుద‌ల‌వుతుందా? అనే చిన్న టెన్ష‌న్ ఉండేది. అయితే సాయికొర్ర‌పాటిగారు అన‌వ‌స‌ర‌మైన పోటీ ఉండ‌కూడ‌దని ఈ సినిమాను జూలై 12న విడుద‌ల చేయ‌డం సంతోషాన్నిచ్చింది“ అన్నారు.

User Comments