మెగా రికార్డ్ బ్రేక్..వ్వావ్వా మ‌హాన‌టి

మ‌హాన‌టి రికార్డుల ఫ‌ర్వం కొన‌సాగుతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియెన్ లెజెండ్ సావిత్రి జీవిత‌క‌థ‌ను వోన్ చేసుకున్నారు. మా తెలుగమ్మాయి అని సెంటిమెంట్ ఫీల‌య్యారు. దాని ఫ‌లితం `మ‌హాన‌టి` అఖండ‌విజ‌యానికి దారి తీసింది. మ‌హాన‌టి చిత్రం మూడు నాలుగు వార‌ల్లోనూ అద్భుత‌మైన వ‌సూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమా అమెరికా బాక్సాఫీస్ వ‌ద్ద అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `ఖైదీ నంబ‌ర్ 150` రికార్డును బ్రేక్ చేసి, నితిన్ హీరోగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన `అ..ఆ` చిత్రాల రికార్డుల్ని అధిగ‌మించేందుకు కూత‌వేటు దూరంలో ఉంది.

అమెరికా బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఇప్ప‌టికే 7వ స్థానంలో ఉన్న మ‌హాన‌టి త‌దుప‌రి టాప్ 6లో చేరేందుకు ఎంతో స‌మ‌యం ప‌ట్టద‌ని ట్రేడ్ చెబుతోంది. ఖైదీనంబ‌ర్ 150- 2.447 మిలియ‌న్ డాల‌ర్లు, అ..ఆ- 2.449 మిలియ‌న్‌ డాల‌ర్లు వ‌సూలు చేయ‌గా, మ‌హాన‌టి-2.448 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసింది. మునుముందు 2.5 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల‌ను అధిగ‌మించి టాప్ 6 స్థానం అందుకుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. నాలుగోవారంలోనూ బాగా ఆడితే 2.75 మిలియ‌ణ్ డాల‌ర్ల వ‌ర‌కూ వ‌సూలు చేస్తుందేమోన‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికైతే మెగా రికార్డ్ బ్రేకైంది.