నితిన్ హీరోయిన్ వాలంటైన్ డే స్పెషల్

మేఘాఆకాష్.. ఈ పేరు గుర్తు పెట్టుకోండి. ఖచ్చితంగా ఇంకొన్ని రోజుల్లో ఈ బ్యూటీ ద‌శ తెలుగులో మారిపోవ‌డం ఖాయం. ఇప్ప‌టికే లై సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది ఈ బ్యూటీ. కానీ ఏం చేస్తాం ఆ సినిమా డిజాస్ట‌ర్. అయినా కూడా మేఘాఆకాష్ గ్లామ‌ర్ కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.

Megha Akash Exclusive Valentine Day Special Photoshoot

మేఘా ఇప్పుడు మ‌రోసారి నితిన్ సినిమాతోనే వ‌స్తుంది. ఓ వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే.. మ‌రోవైపు ఫోటోషూట్ల‌తోనూ కాలం గ‌డిపేస్తుంది మేఘాఆకాష్. తాజాగా వాలెంటైన్ డే సంద‌ర్భంగా ఈ భామ స్పెష‌ల్ ఫోటోషూట్ చేసింది.

Megha Akash Exclusive Valentine Day Special Photoshoot

విమెన్ ఎక్సక్లూసివ్ మ్యాగ‌జైన్ కవ‌ర్ పేజీపై చాలా ప‌ద్ద‌తిగా ద‌ర్శ‌న‌మిచ్చింది మేఘా. ఇదివ‌ర‌కు ఫోటోషూట్ అంటే అందాల ఆర‌బోత‌కే ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇచ్చే మేఘా.. ఈ సారి మాత్రం చాలా చ‌క్క‌గా క‌నిపించింది. చూపుల‌తోనే గాలం వేసింది.

Megha Akash Exclusive Valentine Day Special Photoshoot

మేఘాఆకాశ్ ప్ర‌స్తుతం తెలుగులో త‌న అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. లై త‌ర్వాత మ‌రోసారి నితినే ఈ భామ‌కు ఆఫ‌ర్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రూ క‌లిసి చ‌ల్ మోహ‌న‌రంగ సినిమాలో న‌టిస్తున్నారు. కృష్ణ‌చైత‌న్య తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్మాత‌లు. నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి కూడా ఓ నిర్మాతే.

Megha Akash Exclusive Valentine Day Special Photoshoot

ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ కు రెస్పాన్స్ బాగుంది. మేఘా లుక్ కు కూడా మంచి అప్లాజ్ వ‌స్తుంది. ఏప్రిల్ 5న ఛ‌ల్ మోహ‌న‌రంగ విడుదల కానుంది. ఈ సినిమాతో త‌న జాత‌కం మారిపోతుంద‌ని ఆశిస్తుంది మేఘాఆకాష్.

User Comments