ట్రైల‌ర్ పేరుతో సినిమా లీక్‌!

Last Updated on by

కుమారుడు ఆకాష్‌ని స్టార్ హీరోని చేయ‌డ‌మే ధ్యేయంగా కంక‌ణం క‌ట్టుకున్నాడు స్పీడ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌. ఏ స్టార్ హీరో ఇక త‌న ఫోన్ లిఫ్ట్ చేయాల్సిన ప‌నేలేదు. ఏ నిర్మాత మొహం చాటేయాల్సిన అవ‌స‌రం అస‌లే లేదు. పూరీకి కొడుకే పెద్ద అండ‌. అప్ప‌ట్లో కెరీర్ ఆరంభం చేసిందే ఇప్పుడు కూడా చేస్తున్నాడు. అస‌లు స్టార్ హీరోలు అవ‌కాశాలివ్వ‌డం అంటే ఎంత క‌ష్ట‌మో తెలిసిన‌వాడిగా పూరి ఇప్పుడు ఓ బ్ర‌హ్మాస్త్రాన్ని త‌యారు చేస్తున్నాడు. ఆకాష్ అనే నారాయ‌ణాస్త్రాన్ని సంధించేందుకు ప్రిపేర‌య్యాడు. పూరీని కెరీర్ ఆరంభం ఆదుకున్న‌ది మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. అప్ప‌ట్లో ర‌వితేజ‌ను త‌యారు చేసుకుందే పూరి. ఇప్పుడు అదే స‌న్నివేశం.

ర‌వితేజ‌లా పూరి త‌న కొడుకును త‌యారు చేస్తున్నాడు. మాస్ రాజా త‌ర‌వాత వార‌సుడిగా ఆకాష్‌ని ప‌క్కాగా ప్రిపేర్ చేస్తున్నాడు. ప్ర‌తి కొలువులో ఆస్థాన హీరోలు త‌ప్ప‌నిస‌రి. అలా త‌న ఒర నుంచి దూస్తున్న క‌త్తి ఆకాష్‌. అత‌డు క‌త్తిలా గుచ్చుకుంటాడా? లేదా? అన్న‌ది మ‌రో రెండ్రోజుల్లోనే తేలిపోనుంది. ఆకాష్ పూరి న‌టించిన `మెహ‌బూబా` మే 11న అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. మూడు రోజుల ముందే సినిమా మొత్తం ఫ్లేవ‌ర్ ఎలా ఉంటుందో తెలిపే 30 సెక‌న్ల ప్రోమో మిక్స‌ర్‌ని పూరి రిలీజ్ చేశాడు. ఇందులో ఆకాష్ ఎబిలిటీస్ అన్నిటినీ చూపించేశాడు. ఓ ర‌కంగా చెప్పాలంటే ట్రైల‌ర్ పేరుతో సినిమా చూపించేశాడు. హిందూ ముస్లిమ్ ప్రేమ‌క‌థ‌ను బార్డ‌ర్ లో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించాడ‌నే ఈ ప్రోమో మిక్స‌ర్ చెబుతోంది. పూరీని నిజంగానే నిల‌బెట్టే స‌ల్మాన్‌, షారూక్‌, అమీర్‌ఖాన్ లాంటి కొడుకొచ్చాడా? లేదా? అన్న‌ది కాస్త ఆగి చూడాలి. అన్న‌ట్టు ట్రైల‌ర్‌లో క‌నిపిస్తున్న ఆ హెలీకాఫ్ట‌ర్ల‌ను పూరి ఎంత‌కు అద్దెకు తీసుకున్నాడ‌బ్బా?

User Comments