మెహ‌బూబాకి థ‌మ్సప్ ఇచ్చారు!

Last Updated on by

అన్నం ఉడికిందో లేదో చెప్ప‌డానికి ఒక్క మెతుకు ప‌ట్టుకుంటే చాల‌దూ? ట‌్రైల‌ర్‌తో అలాంటి క‌న్ఫ‌ర్మేష‌నే ఇచ్చాడు పూరి జ‌గ‌న్నాథ్‌. త‌న‌యుడు ఆకాష్ పూరి హీరోగా అత‌డు తెర‌కెక్కించిన `మెహ‌బూబా` మే 11న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే రెండ్రోజుల ముందే ఈ సినిమా ఎలా ఉండ‌బోతోంది? అన్న రిపోర్ట్ అందేసింది. ఇప్ప‌టికే ఈ సినిమాని వీక్షించిన చిత్ర‌యూనిట్ పూర్తి సంతృప్తిగా ఉంది. కొంద‌రు బ‌య‌టివారికి, మ‌రికొంద‌రు కాలేజీ కుర్రాళ్ల‌కు ఈ సినిమాని చూపించారు.

ప్రివ్యూ వీక్షించిన అనంత‌రం కాలేజ్ గయ్స్ అయితే ఫుల్‌గా జోష్‌లోకి వెళ్లిపోయార‌ట‌. అబ్బ‌బ్బ‌.. ఇలాంటి ల‌వ్‌స్టోరీని ఇంత‌వ‌ర‌కూ తెలుగు సినిమాల్లో చూడ‌లేదు అంటూ కితాబిచ్చేశారు టీనేజీ గ‌య్స్‌. ఇక కొంత‌మంది టెక్నిక‌ల్ టీమ్ సైతం మెహ‌బూబాని హై స్టాండార్డ్స్‌లో తెర‌కెక్కించ‌డంలో పూరి ప‌నిత‌నానికి హ్యాట్సాఫ్ చెప్పారు. హేమంత్ మ‌ధుక‌ర్ మాట్లాడుతూ … ఇప్పుడే సినిమా చూశాను. మెహ‌బూబా టెర్రిఫిక్ మూవీ. ఆకాష్ బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌.. పూరి అద్భుత‌మైన క‌థ నేరేష‌న్‌.. సందీప్ చౌతా సంగీతం అద్భుతంగా ఉంది.. అని పొగిడేశాడు. మొత్తం టీమ్‌కి థ‌మ్సప్ అంటూ.. జోష్ పెంచాడు. ఈ రివ్యూల‌ను బ‌ట్టి పూరీ ఈజ్ బ్యాక్‌.. అని భావించాల్సి ఉంటుంది. ఇంకో రెండ్రోజుల్లో అస‌లు సంగ‌తేంటో తేల్తుంది. అంత‌వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.

User Comments