మెహ‌బూబా రివ్యూ

Last Updated on by

రివ్యూ: మెహ‌బూబా

న‌టీన‌టులు: ఆకాశ్ పూరీ, నేహాశెట్టి, సాయాజీషిండే, ముర‌ళి శ‌ర్మ త‌దిత‌రులు

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: పూరీ జ‌గ‌న్నాథ్

నిర్మాత‌: పూరీ క‌నెక్ట్స్

మెహ‌బూబా.. ఇన్నాళ్లూ ఎంతోమంది హీరోల‌తో ఎన్నో హిట్లు ఇచ్చిన పూరీ జ‌గ‌న్నాథ్.. త‌న వార‌సున్ని ప‌రిచ‌యం చేసిన సినిమా. పైగా ఇన్నాళ్లూ చేసిన రెగ్యురేటింగ్:ల‌ర్ సినిమాల్లా కాకుండా కొత్త‌గా ఇండో పాక్ వార్ తీసుకున్నాడు. మ‌రి ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఎంత‌వ‌ర‌కు మెప్పించింది..?

క‌థ‌:
రోష‌న్ (ఆకాశ్) ఇంజ‌నీరింగ్ పూర్తి చేసుకుని ఆర్మీలో జాయిన్ అవ్వ‌డానికి రెడీ అవుతుంటాడు. అదే స‌మ‌యంలో పాకిస్థానీ అయిన ఆఫ్రీన్ (నేహాశెట్టి) హైద‌రాబాద్ కు ఇంజ‌నీరింగ్ చదుకోడానికి వ‌స్తుంది. చిన్న‌ప్ప‌ట్నుంచీ ప్ర‌తీరోజు క‌ల‌లో ఓ అమ్మాయిని ప్రేమించిన‌ట్లు రోష‌న్ కు.. ఓ అబ్బాయిని ప్రేమించిన‌ట్లు ఆఫ్రీన్ కు క‌నిపిస్తుంది. ఓ సారి హిమాల‌యాల‌కు ట్రెక్కింగ్ కు వెళ్లిన‌పుడు రోష‌న్ కు ఓ అమ్మాయి శ‌వం క‌నిపిస్తుంది. అది క‌నిపించిన త‌ర్వాత గ‌త‌జ‌న్మ గుర్తొస్తుంది రోష‌న్ కు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది..? ఆ అమ్మాయి శ‌వంతో రోష‌న్ కు సంబంధం ఏంటి..? అస‌లు పాక్ కు ఎందుకు వెళ్లాడు అనేది క‌థ‌..

క‌థ‌నం:
పూరీ సినిమా అంటే కేరాఫ్ మాఫియా అని కొన్నేళ్లుగా ఫిక్స్ అయిపోయారు. అది మార్చాల‌నుకున్నాడో ఏమో కానీ ఈ సారి కొత్త‌గా ఉంటుంద‌ని ఇండో పాక్ క‌థ రాసుకుని వ‌చ్చాడు పూరీ జ‌గ‌న్నాథ్. కొడుకుతో కొత్త‌గా ట్రై చేసాడు. చాలా ఏళ్ళ త‌ర్వాత ప్రేమ‌క‌థ రాసుకున్నాడు. తొలి సీన్ నుంచే తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగానే చూపిస్తూ వ‌చ్చాడు. హీరో కారెక్ట‌ర్ ను ఎప్పుడూ ర‌ఫ్ గా చూపించే పూరీ.. ఈ సారి మాత్రం దేశం ప‌ట్ల గౌర‌వం ఉండేలా.. బాధ్య‌త‌గా ఉండేలా చూపించాడు. సోల్జ‌ర్ కారెక్ట‌ర్ కావ‌డంతో అది క‌నిపించింది. ఫ‌స్టాఫ్ లో ఎక్క‌డా ప్రేమ ఎక్కువ‌గా క‌నిపించ‌దు. హీరో హీరోయిన్లు చూసుకోకుండానే చాలా క‌థ అయిపోతుంది. ఒక్క‌సారి చూసుకున్న త‌ర్వాత గ‌త‌జ‌న్మ‌.. వాళ్ల ప్రేమ‌లు గుర్తొస్తాయి. అదేదో మ‌గ‌ధీర రేంజ్ లో ఊహించుకుంటే పొర‌పాటే. ఇది పూరీ జ‌గ‌న్నాథ్ సినిమా క‌దా.. ఇక్క‌డ ఉండేవ‌న్నీ గ‌న్నులు.. గుళ్లే. ప్రేమ మాత్రం క‌నిపించ‌దు. సైనికుడికి, రెఫ్యూజికి మ‌ధ్య పుట్టే ప్రేమ‌క‌థ ఇది. గ‌త‌జ‌న్మ‌లో అంటే 1971 ఇండో పాక్ వార్ నేప‌థ్యంలో జ‌రిగే క‌థ కాబ‌ట్టి అక్క‌డ ద‌ర్శ‌కుడు రాసుకున్న స్క్రీన్ ప్లే బాగుంది. చిన్న ట్విస్ట్ తో ఆస‌క్తి పుట్టించాడు కానీ అదే టెంపో మాత్రం కొన‌సాగించ‌లేక‌పోయాడు. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు పూరీ డీసెంట్ గానే క‌థ న‌డిపించాడు కానీ ఆ త‌ర్వాతే పూర్తిగా గాడి త‌ప్పింది. యుద్ధంతో పాటే క‌థ కూడా ట్రాక్ త‌ప్పింది. ఎక్క‌డా ఆస‌క్తి క‌నిపించ‌క‌పోగా.. వ‌చ్చిన స‌న్నివేశాలే మ‌ళ్లీ మ‌ళ్లీ క‌నిపించి బోర్ కొట్టించాడు పూరీ. ప్రేమ స‌న్నివేశాలు కూడా బ‌లంగా రాసుకోలేక‌పోయాడు. గ‌త‌జ‌న్మ అంటే ఎంతో గొప్ప‌గా ఉంటుంద‌ని ఊహిస్తాం కానీ అక్క‌డ అంత స్కోప్ ఉండేలా మాత్రం సీన్స్ రాసుకోలేదు ద‌ర్శ‌కుడు. ఈ జ‌న్మ‌లో కూడా పాక్ అమ్మాయిని ప్రేమించ‌డం.. అక్క‌డికి వెళ్లి అమ్మాయిని తెచ్చుకోవ‌డం ఇవ‌న్నీ సినిమాటిక్ గా అనిపిస్తాయి.. ఎక్క‌డా లాజిక్ ఉండ‌దు. క్లైమాక్స్ కూడా ఊహించినంత‌గా లేదు. సింపుల్ గా తేల‌కొట్టేసాడు.

న‌టీన‌టులు:
ఆకాశ్ పూరీ బాగా న‌టించాడు. చిన్న‌ప్ప‌ట్నుంచీ న‌టించ‌డం వ‌ల్లో ఏమో కానీ కెమెరా అంటే భ‌యం, బెరుకు రెండూ క‌నిపించ‌లేదు. బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సైనికుడిగా.. ప్రేమికుడిగా. కానీ క‌థ ఈయ‌న‌కు స‌హ‌క‌రించ‌లేదు. నేహాశెట్టి స‌ర్ ప్రైజ్ ప్యాకేజ్. చాలా బాగుంది.. అభిన‌యంతో స‌హా. ఇక హీరో తండ్రిగా సాయాజీ షిండే.. హీరోయిన్ తండ్రి పాకిస్థానీగా ముర‌ళీ శ‌ర్మ ప‌ర్లేదు. మిగిలిన వాళ్లంతా కొత్త మొహాలే. అంతా క‌థ‌లో అప్పుడ‌ప్పుడూ వ‌చ్చి వెళ్లే కారెక్ట‌ర్స్.

టెక్నిక‌ల్ టీం:
సందీప్ చౌతా చాలా రోజుల త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు. రెండు పాట‌లు బాగున్నాయి. విజువ‌ల్ గా కూడా బాగా చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు పూరీ. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ ప‌ర్లేదు. సెకండాఫ్ లో చాలా సీన్లు బోర్ కొట్టించాయి. ఇక విష్ణు శ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. రిచ్ గా ఉంది ప్ర‌తీ విజువ‌ల్ కూడా. పూరీ క‌నెక్ట్స్ నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి. కొడుకే క‌దా అని బాగా ఖ‌ర్చు చేసాడు పూరీ జ‌గ‌న్నాథ్. ఇక ద‌ర్శ‌కుడిగా ఆయ‌న మ‌రోసారి ఫెయిల్ అయ్యాడు. అయితే ర‌చ‌యిత‌గా మాత్రం అక్క‌డ‌క్క‌డా త‌న మార్క్ పంచులు చూపించాడు. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ లో వ‌చ్చే కొన్ని డైలాగ్స్ వింటేజ్ పూరీని చూపించాయి. ఓవ‌రాల్ గా డిఫెరెంట్ సినిమా చేసాడు కానీ క‌మ‌ర్షియ‌ల్ సినిమా మాత్రం కాదు.

చివ‌ర‌గా:
మెహ‌బూబా.. ఆకాశ్ అదుర్స్.. పూరీ బెదుర్స్..

రేటింగ్: 2.5/5.0

User Comments