ఈ జనవరి నాకు ట్రిపుల్ సెలబ్రేషన్సే : మెహరీన్

నందమూరి కల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఎంత మంచివాడవురా`. ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 15న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మెహరీన్ పాత్రికేయులతో మాట్లాడుతూ …
* ఈ జనవరి నాకు ట్రిపుల్ సెలబ్రేషన్సే..ఎందుకంటే ఈ సంక్రాంతికి తెలుగులో `ఎంత మంచివాడవురా`తో తెలుగు ప్రేక్షకులను, `పటాస్` చిత్రంతో తమిళ ప్రేక్షకులను పలకరిస్తున్నాను. అలాగే జనవరి 31న `అశ్వథ్థామ` విడుదలవుతుంది.
* ఎఫ్2 సినిమాలో నేను చేసిన హని క్యారెక్టర్ బాగా పాపులర్ అయ్యింది. అది పక్కా కామెడీగా సాగుతుంది. `ఎంత మంచివాడవురా` విషయానికి వస్తే అది పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో మిక్స్ అయ్యి ఉంటుంది. సినిమాలో నా పాత్ర పేరు నందు. ఫస్టాఫ్‌లో బబ్లీగా ఉంటుంటుంది. సెకండాఫ్‌లో మెచ్యూర్డ్‌గా ఉంటుంది. ఇందులో నేను షార్ట్ ఫిలిమ్ ప్రొడ్యూసర్.. కల్యాణ్‌రామ్‌గారు నా షార్ట్ ఫిలిమ్స్‌లో హీరోగా చేస్తుంటారు. ఇద్దరం చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్‌గానే ఉంటారు.
* ఫ్యామిలీ ఎమోషన్సే కావు.. సినిమాలో మంచి యాక్షన్, లవ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. పండగ సినిమా.
* గుజరాతీ సినిమా `ఆక్సిజన్`కు ఇది రీమేక్. కానీ.. తెలుగు ప్రేక్షకులకు నెటివిటీకి తగినట్లు చాలా మార్పులే చేశారు. అందువల్ల నేను మాతృకను చూడలేదు. అదీకాకుండా ఇతరుల యాక్టింగ్‌ను కాపీ కొట్టడం నాకు ఇష్టం లేదు.
* సినిమా కోసం చాలా కష్టపడ్డాను. ఉదాహరణకు ఓ సన్నివేశంలో తనికెళ్ల భరణిగారు మూడు పేజీల డైలాగ్ చెబుతారు. నేను కూడా మూడు పేజీల డైలాగ్ చెప్పాలి. దాని కోసం చాలా కష్టపడి నేర్చుకున్నాను. సింగిల్ టేక్‌లో ఆ షాట్ ఓకే అయ్యింది. ఇలాంటి క్యారెక్టర్స్ మళ్లీ రాదు అనిపించి ఒప్పుకుని నటించాను. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా సినిమాను తీర్చిదిద్దారు.
* నేను ఆన్‌స్క్రీన్‌లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లోనూ సరదాగా ఉంటాను. దాంతో దర్శకుడు సతీశ్‌గారు నన్ను కాంటాక్ట్ చేశారు. ఎఫ్ 2 తర్వాత ఐదారు నెలలు ఖాళీగా ఉన్నాను. తర్వాతనే నాకు ఈ సినిమాలో అవకాశం దక్కింది.
* సినిమా అనేది బలమైన మాధ్యమం. కేవలం సినిమాను ఎంటైర్టైన్మెంట్ కోసమే కాదు.. సినిమాలో మనం ఏదైనా మంచి విషయాన్ని చెప్పాలి.
* ఎమోషనల్ సీన్స్ చేయడం నా బలం. సాధారణంగా ఎమోషనల్ సీన్స్‌లో నటించడానికి గ్లిజరిన్ వాడుతారు. నేను గ్లిజరిన్ వాడను. ఎమోషనల్‌గా పాత్రకు కనెక్ట్ అయ్యి నటించడానికి ప్రయత్నిస్తాను.
* జయాపజయాలు మన చేతిలో ఉండవు. సినిమా కథలను ఎంచుకునేటప్పుడు మంచి కథలు ఉండేలా చూసుకోవాలి. ఆ పాత్రలకు న్యాయం చేయాలి. అందరూ మంచి సినిమాలు చేయడానికే ప్రయత్నిస్తారు. కానీ ప్రేక్షకులకు నచ్చితేనే సినిమా సక్సెస్ అవుతుంది.
* ప్రస్తుతం నేను దక్షిణాది సినిమాలతోనే బిజీగా ఉన్నాను. బాలీవుడ్ గురించి ఆలోచించడం లేదు. అయితే నా తమ్ముడు మాత్రం బాలీవుడ్లో యాక్టర్‌గా కరణ్ జోహార్గారి ద్వారా లాంచ్ అవుతున్నాడు. తెలుగు చిత్రసీమ నాకు అమ్మతో సమానం.