మైకెల్ జాక్స‌న్ డాట‌ర్ సూసైడ్ అటెంప్ట్

దివంగ‌త పాప్ రారాజు మైకెల్ జాక్సన్ కుమార్తె సూసైడ్ అటెంప్ట్ చేసిందా? త‌ండ్రిపై వ‌స్తోన్న రూమ‌ర్లు భ‌రించ‌లేక‌నే మ‌న‌స్తాపం చెంది..ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిందా ? అంటే అవున‌నే తెలుస్తోంది. మైకెల్ జాక్సన్ జీవితంపై లీవింగ్ నెవ‌ర్ ల్యాండ్ అనే ఓ డాక్యెమెంట‌రీ తెర‌కెక్కించారు. అందులో కొన్ని స‌న్నివేశాలు నెటింట్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ఓసీన్ లో మైకెల్ పాత్ర‌ధారి ఇద్ద‌రు టీనేజ్ యువ‌కుల‌పై లైంగిక దాడికి పాల్ప‌డ్డ‌ట్లు చిత్రీక‌రించారు. ఆ సీన్లు లీక‌వ్వ‌డం..సోష‌ల్ మీడియాలో నేటి జ‌నులు విమ‌ర్శించ‌డంతో మైక్ కుమార్తె ప్యారిస్ జాక్సన్ త‌ట్టుకోలేక మ‌న‌స్తాపానికి గురైంది.

తండ్రి ప‌రువును బ‌జారుకీడుస్తున్నారనే బాధ‌తో ప్యారిస్ ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నం చేసింద‌ట‌. భార‌త కాల మాన ప్ర‌కారం ఆదివారం ప్యారిస్ చేయి కోసుకుని సూసైడ్ అటెంప్ట్ చేసిందిట‌. వెంట‌నే ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించడంతో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకుంది. ఈ విష‌యాన్ని ఆమెరికా పోలీసులు ధృవీక‌రించ‌డంతోనే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్యారిస్ ఆరోగ్యం బాగానే ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు.