విక్ర‌మ్ సినిమాకి షాకిచ్చిన మ‌లేషియా

చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన క‌డ‌రం కొండాన్ తెలుగులో మిస్ట‌ర్ కె.కె టైటిల్ తో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈసినిమా తెలుగు మిన‌హా అన్ని చోట్ల మంచి ఫ‌లితాలు సాధిస్తోంది. తెలుగులో మాత్రం మ‌రోసారి నిరాశ త‌ప్ప‌లేదు. తాజాగా మ‌లేషియా ప్ర‌భుత్వం మాత్రం విస్ట‌ర్ కె.కె కి ఊహించ‌ని షాకిచ్చింది. సినిమాలో మ‌లేషియా పోలీసులు స‌మాజం గురించి త‌ప్పుగా చూపించార‌ని అక్క‌డి సెన్సార్ బోర్డ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. దీంతో సినిమా రిలీజ్ చేయ‌డానికి అనుమ‌తివ్వ‌మ‌ని క్లియ‌ర్ గా చెప్పేసింది.

దీంతో మ‌లేషియాలోని విక్ర‌మ్ అభిమానులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. ఈ నేప‌థ్యంలో కొంత మంది అభిమానులు ప‌క్క‌నే గ‌ల సింగ‌పూర్ కు వెళ్లి విక్ర‌మ్ సినిమా చేస్తున్నారుట‌. ఈ విష‌యాన్ని చిత్ర పంపిణీ దారులు తెలిపారు. సినిమాను మ‌లేషియాలో విడుద‌ల చేయ‌లేక‌పోతున్నామ‌ని క్ష‌మాప‌ణ‌లు కోరారు. అయితే దీనిపై విక్ర‌మ్ ఇంకా స్పందించలేదు. ఇందులో అక్ష‌ర హాస‌న్, అబీ హాస్స‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. రాజేష్ ఎమ్ సెల్వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.