విద్య మాఫియాపై ఎమ్మెల్యే విజ‌యం 

గత వారం రోజులుగా ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు ప్రయివేట్, కార్పొరేట్ విద్య సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేయడంతో బయట పడిన చదువుల మాఫియా ఆగడాలను స్యయంగా పరిశీలించారు. దింతో విద్యార్థులు తల్లదండ్రుల నుంచి ఎలా ఫీజులను దండుకుంటున్నారో, అక్కడ విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో అన్ని విద్యాసంస్థలకు వారం రోజులు గడువు ఇచ్చి, అన్ని పద్ధతులు మార్చాలని గట్టిగా వార్ణింగ్ ఇచ్చారు. దింతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం ఫీజులపై  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్య అధికారులు, ప్రయివేట్, కార్పొరేట్ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. తీసుకున్న నిర్ణయాలు….1 . ఫీజులపై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్య సంవత్సరానికి

క్యాటగిరి                                పట్టణంలో (రూ.) రూరల్ ప్రాంతాలలో (రూ.)
ప్రైమరీ స్కూల్ కి                     9000                          7800
అప్పర్ ప్రైమరీ స్కూల్ కి         9000                          7800
హై స్కూల్ కి                            12000                        10800

2. ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు వచ్చిన ఫీజులలో క్రింది విధంగా ఖర్చులు చేయాలి.
– 20 % సిబ్బంది జీతాలకు
– 15 % స్కూల్ నిర్వహణకు
– 15 % స్కూల్ అభివృద్ధి పనులకు
– 15 % సిబ్బంది యొక్క GF , PF & GIS కు ఖర్చు చేయాలి.
– 5 % యాజమాన్యపు లాభంగా తీసుకోవాలని నిర్ణయించారు.

3 . లాగి 25 % కూడా ఈ క్యాటగికి ఎంత శాతం అన్నది ఇలా నిర్ణయించారు.
– అనాధలకు, దివ్యంగులకు, HIV బాధితులకు = 5 %
– SC లకు     = 10 %
ST లకు   = 4 %
BC , మైనారిటీ, OC (ఆర్థికంగా వెనుకబడిన/రూ.6000 ల లోపు సంవత్సరం ఆదాయం కలిగినవారు) = 6 %. మొత్తం = 25 %
ఈ నిబంధలు అన్ని ఈ నిమిషం నుంచి అమలు అవుతాయని జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు.