న‌టితో ఎమ్మెల్యే కొడుకు అస‌భ్యంగా

బిగ్ బాస్ -2 ఫేం.. మోడ‌ల్  సంజ‌న గురించి తెలిసిందే.  అయితే రియాలిటీ వాతావ‌ర‌ణం అల‌వ‌రుచుకోవ‌డంలో విఫ‌ల‌మై ఎలిమినేట్ అయి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. దీంతో  సంజ‌న మిగ‌తా కంటెస్టెంట్లు  తేజ‌స్వీ, బాబు గోగినేనిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి సోష‌ల్ మీడియాలో హైలైట్ అయింది. త‌ర్వాత సంజ‌న క‌నుమ‌రుగైన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఓ వివాదాస్ప‌ద అంశంతో మ‌ళ్లీ సోష‌ల్ మీడియాద్వారా ట‌చ్ లోకి వ‌చ్చింది. ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు త‌న‌ని తాక‌రాని చోట తాకి  అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని ఆరోపించింది. మ‌రి ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగింది? అస‌లేం జ‌రిగింది?  అన్న‌ది తెలియాలంటే అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

మాదాపూర్ లోని ఓ ప‌బ్ లో ప‌టాన్ చేరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వ‌ర్ గౌడ్ కుమారుడు అశీష్  గౌడ్ శ‌నివారం రాత్రి  హ‌ల్చ‌ల్ చేసాడు. పీక‌ల‌దాకా మ‌ద్యం సేవించి ప‌బ్ లో నానా హ‌డావుడి చేసాడు. ప‌బ్బుకొచ్చిన యువ‌త‌లంద‌రితోనూ అస‌భ్యంగా  ప్ర‌వ‌ర్తించాడుట‌. ఇదేమిట‌ని ప్ర‌శ్నిస్తే తిరిగి దాడికి య‌త్నించాడుట‌. దీంతో కొంద‌రు యువ‌తులు మాదాపూర్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేయ‌డంతో ఈ విష‌యం  బ‌య‌ట‌కు వ‌చ్చింది. హైటెక్స్ నోవాట‌ల్ లో ఈ ఘ‌ట‌న అర్ధ‌రాత్రి  2 గంట‌ల‌కు చోటు చేసుకుందిట‌. ఫిర్యాదు చేసిన వారిలో సంధ్య కూడా ఉంది. మ్యూజిక్ ప్రొగ్రామ్ లో అశీష్  తాక‌రాని చోట తాకి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, అస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషించాడ‌ని, నోటికొచ్చిన బూతులు తిట్టాడ‌ని ఫిర్యాదులో పేర్కొంది. సంజ‌న చేసిన ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు  కేసు ఫైల్ చేసిన‌ట్లు తెలుస్తోంది.