మోహ‌న్ బాబు ఈస్ బ్యాక్

Last Updated on by

చాలా రోజుల త‌ర్వాత ఇండ‌స్ట్రీలో మోహ‌న్ బాబు సినిమాపై కాస్త ఆస‌క్తి.. దానికి మించి అంచ‌నాలు క‌నిపిస్తున్నాయి. ఈయ‌న న‌టిస్తోన్న గాయ‌త్రిపై ఈ మ‌ధ్య చ‌ర్చ బాగానే జ‌రుగుతుంది. ఇది మొద‌లైన‌పుడు ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు కానీ విడుద‌ల‌కు స‌మీపిస్తున్న కొద్దీ సినిమాపై చ‌ర్చ పెరిగింది. ఇందులో మోహ‌న్ బాబు క్యారెక్ట‌రైజేష‌న్ నుంచి.. విష్ణు అతిథిపాత్ర వ‌ర‌కు అన్నీ స్పెష‌లే అంటున్నాడు ద‌ర్శ‌కుడు మ‌ద‌న్. అప్ప‌ట్లో పెళ్లైన కొత్త‌లో లాంటి క్లాస్ సినిమా చేసిన ఈయ‌న‌.. ఇప్పుడు మోహ‌న్ బాబుతో ప‌క్కా మాస్ సినిమా చేసాడు. ఈ చిత్ర సెన్సార్ పూర్త‌యింది. యు బై ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చింది బోర్డ్. సినిమాలో యాక్ష‌న్ బాగా ఎక్కువ‌గా ఉండ‌టంతో యు కు తోడుగా ఏ ను కూడా ఇచ్చారు. సెన్సార్ టాక్ ప్ర‌కారం సినిమా చాలా ఇంటెన్సివ్ గా ఉంటుంద‌ని తెలుస్తుంది.

ఇందులో మోహ‌న్ బాబు చాలా ఈజ్ తో క‌నిపించాడ‌ని.. ఈ మ‌ధ్య కాలంలో ఏ సినిమాలో కూడా క‌లెక్ష‌న్ కింగ్ ఇంత యాక్టివ్ గా క‌నిపించ‌లేదంటున్నారు సెన్సార్ స‌భ్యులు. మ‌రీ ముఖ్యంగా సెకండాఫ్ లో గాయ‌త్రిగా క‌లెక్ష‌న్ కింగ్ న‌ట‌న ఒక‌ప్ప‌టి మోహ‌న్ బాబును గుర్తుకు చేస్తుందంటున్నారు వాళ్లు. మ‌రోవైపు మోహ‌న్ బాబు కూడా ఈ చిత్రం త‌న‌కు మ‌రో అసెంబ్లీ రౌడీ అవుతుంద‌ని ధీమాగా చెబుతున్నాడు. ఈ చిత్రంలో నిఖిల విమల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రల్లో క‌నిపిస్తున్నారు. ఫిబ్రవరి 9 న గాయత్రి విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని మోహన్ బాబు తన శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పై నిర్మించగా అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు. మ‌రి.. ఈ చిత్రం మోహ‌న్ బాబు కెరీర్ కు సెకండ్ ఇన్నింగ్స్ అవుతుందో లేదో..?

User Comments