గాయ‌త్రి మ‌రీ అంత దారుణ‌మా..?

మోహ‌న్ బాబు సినిమా అంటే ఇప్పుడు పెద్ద‌గా ఆస‌క్తి ఉండ‌ద‌ని తెలుసు. కానీ మ‌రీ ఇంత ఆస‌క్తి లేకుండా ఉంటార‌ని మాత్రం ఎవ‌రూ అనుకోలేదు. అరే.. క‌నీసం ప్రేక్ష‌కులు క‌లెక్ష‌న్ కింగ్ ను చూడ్డానికి ఆస‌క్తి చూపించ‌ట్లేద‌ని గాయ‌త్రితో అర్థ‌మైపోయింది. ఈ చిత్రానికి తొలి మూడు రోజుల్లో క‌నీసం 2 కోట్ల షేర్ కూడా రాక‌పోవ‌డం విడ్డూరం. ఇక ఓవ‌ర్సీస్ లో అయితే ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. అక్క‌డ ఊరు పేరు లేని సినిమాలు కూడా ఒక్కోసారి ఓకే టాక్ తో 50 ల‌క్ష‌లు వ‌సూలు చేస్తుంటాయి. కానీ మోహ‌న్ బాబు లాంటి హీరో ఉన్నా కూడా అక్క‌డి ప్రేక్ష‌కులు థియేట‌ర్స్ వైపు క‌నీసం కన్నెత్తి కూడా చూడ‌లేదు. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో ఓవ‌ర్సీస్ లో 18 ల‌క్ష‌లు మాత్ర‌మే వ‌సూలు చేసింది.

ఇది ఈ మ‌ధ్య కాలంలో ఏ తెలుగు సినిమాకు రానంత దారుణ‌మైన వ‌సూళ్లు. మోహ‌న్ బాబు బాగా చేసాడు అనే టాక్ వ‌చ్చింది.. సినిమా సెకండాఫ్ లో కాస్త ప‌ర్లేద‌న్నారు.. అయినా కూడా ప్రేక్ష‌కులు ఈ సినిమా వైపు చూడ‌లేదు.. చూడట్లేదు కూడా..! మంచు విష్ణు పాత్ర‌కు కూడా పెద్ద‌గా అప్లాజ్ రాలేదు. నిజానికి ఈ సినిమాలో విష్ణు పాత్రే మైన‌స్ అయింద‌నే టాక్ కూడా వినిపిస్తుంది ఇండ‌స్ట్రీలో. ఏదేమైనా ఇప్పుడు గాయ‌త్రితో మంచు ఫ్యామిలీకి మ‌రో డిజాస్ట‌ర్ వ‌చ్చేసింది. ఈ చిత్రం కూడా క‌లెక్ష‌న్ కింగ్ ఆశ‌ల‌ను తీర్చ లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు బ్రేక్ ఈవెన్ మాట దేవుడికి తెలుసు.. క‌నీసం నామ‌మాత్ర‌పు వ‌సూళ్లు కూడా రావ‌ట్లేదు. మొత్తానికి మోహ‌న్ బాబు చేయ‌క చేయ‌క చేసిన సినిమా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఏ మాత్రం మాయ చేయ‌లేక‌పోయింది. మ‌రి ఈ ఫ‌లితం చూసిన త‌ర్వాత క‌లెక్ష‌న్ కింగ్ ఎలా ఫీల్ అవుతున్నాడో..?

User Comments