మోహన్ బాబు గృహ నిర్బంధం

ప్ర‌ముఖ సినీ న‌టుడు, క‌లెక్ష‌న్ కింగ్  మోహ‌న్ బాబు రోడ్డెక్కారు. ఆయ‌న స్థాపించిన శ్రీ విద్యానికేత‌న్ విద్యా సంస్థ‌ల‌కు సంబంధించి 9 కోట్ల ఫీజ్ రీయింబ‌ర్స మెంట్ బ‌కాయిలు చెల్లింపులో ప్ర‌భుత్వం విఫ‌లమైంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఏళ్ల త‌ర‌బ‌డి పీజులు చెల్లించ‌కుండా జాప్యం చేస్తుంద‌ని ఆరోపించారు. ఈ విష‌యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప‌ట్టించుకోలేద‌ని, రెక్లెస్ గా స‌మాధానాలు ఇస్తోందని ఆగ్ర‌హం చెందారు. ఈ క్ర‌మంలోనే తాను నిర‌స‌న‌కు దిగాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. ఆయ‌న తోపాటు 10 వేల మంది విద్యార్థ‌ల‌తో క‌ళాశాల నుంచి తిరుపతి వరకు భారీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్నందును ర్యాలీకి పోలీసులు అనుమ‌తివ్వ‌లేదు.

దీంతో నేటి ఉందయం నుంచి తిరుప‌తిలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. భారీగా పోలీసులు విద్యానికేతన్‌కు చేరుకున్నారు. మోహన్‌ బాబును గృహ నిర్బంధం చేశారు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మోహ‌న్ బాబు ఇప్పుడే నిర‌స‌న తెలియ‌జేయ‌డం వెనుక రాజ‌కీయ కోణం ఉంద‌ని, చంద్ర‌బాబును ఎన్నిక‌లు స‌మ‌యంలో బ్యాడ్ చేయాల‌నే ఆలోచ‌న‌తో మోహ‌న్ బాబు ఇలా వ్వ‌వ‌రిస్తున్నాడ‌ని టీడీపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు. గ‌తంలో ప‌లు ఇంట‌ర్వూల్లో మోహ‌న్ బాబు, ముఖ్య‌మంత్రిని ఉద్దేశించి రాజ‌కీయ‌ ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.