చిరు సినిమాలో మోహన్‌బాబు

చిరంజీవి సినిమాకి సంబంధించిన ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. విలన్‌గా మోహన్‌బాబు నటించబోతున్నాడట. చిరు, మోహన్‌బాబు హీరో విలన్లుగా చాలా సినిమాల్లో నటించారు. తాజాగా మరోమారు చిరుని ఢీ కొట్టే పాత్రలో నటించేందుకు మోహన్‌బాబు ఓకే చెప్పేశారట. కొరటాల శివ దర్శకత్వంలోతెరకెక్కుతున్న సినిమాలోనూ ఈ ఇద్దరూ ఢీ కొట్టబోతున్నట్టు సమాచారం. దేవాలయాల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విలన్ కాస్త ప్రత్యేకంగా, చిరు వయసుకు తగ్గట్టుగా ఉంటే బాగుంటుందని శివ కొరటాల భావించారట. ఆయనే మోహన్‌బాబు పేరుని సూచించారట. దాంతో వెంటనే చిరు ఫోన్ చేసి మోహన్‌బాబుతో మాట్లాడారట. ఇద్దరి మధ్య చాలాసేపు సినిమా గురించి చర్చలు జరిగాయట. మోహన్‌బాబు కూడా ఓకే చెప్పేసినట్టు ప్రచారం సాగుతోంది.