గాయ‌త్రి.. నిజంగా అంత ద‌మ్ముందా..?

Last Updated on by

గాయ‌త్రి.. ఈ టైటిల్ అనౌన్స్ చేసిన‌పుడే సినిమాలో ఖచ్చితంగా ఏదో ఉందని ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి మొద‌లైపోయింది. ఇక విజువ‌ల్స్ విడుద‌ల‌వుతున్న కొద్దీ సినిమాపై అంచ‌నాలు కూడా పెరుగుతూ వ‌స్తున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో మోహ‌న్ బాబు సినిమా అంటే పెద్ద‌గా ప‌ట్టించుకోని వాళ్లు కూడా ఇప్పుడు గాయ‌త్రి గురించి ఆరా తీస్తున్నారు. నిజానికి ఇది స్ట్రెయిట్ సినిమా కాదు. రీమేక్ సినిమా. దాన్ని త‌న ఇమేజ్ కి త‌గ్గ‌ట్లు మార్చుకున్నాడు మోహ‌న్ బాబు. గాయ‌త్రికి స్క్రీన్ ప్లే రాసింది కూడా క‌లెక్షన్ కింగే కావ‌డం విశేషం. మ‌ద‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రం క‌చ్చితంగా త‌న‌కు మ‌రో అసెంబ్లీ రౌడీ అవుతుంద‌ని ఆశిస్తున్నాడు ఈ సీనియ‌ర్ హీరో.

ఇందులో శివాజీ, గాయ‌త్రి ప‌టేల్ గా ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు మోహ‌న్ బాబు. శివాజీకి న‌టుడు కావాల‌నేది ఆశ‌.. గాయ‌త్రి ప‌టేల్ ప‌క్కా విల‌న్. చాలా ఏళ్ళ త‌ర్వాత పూర్తిస్థాయి నెగిటివ్ రోల్ చేస్తున్నాడు మోహ‌న్ బాబు. ఇందులో విష్ణు కూడా న‌టించాడు. ఇది యంగ్ మోహ‌న్ బాబు పాత్ర‌. ఈ పాత్ర కోసం మ‌రో హీరో ఎందుక‌ని.. విష్ణునే చేస్తానని చేశాడు. ఈ పాత్ర సినిమాకు ప్రాణం అని తెలుస్తుంది. ఇప్ప‌టికే పూర్తైన సెన్సార్ ప్ర‌కారం సినిమా ప‌క్కా మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తుంది. థ‌మ‌న్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం. ఫిబ్ర‌వ‌రి 9న గాయ‌త్రి విడుద‌ల కానుంది. కుర్ర హీరోల‌తో పోటీ ప‌డి మ‌రీ వ‌స్తున్నాడు మోహ‌న్ బాబు. అయినా కూడా త‌న‌కు వ‌చ్చే న‌ష్ట‌మేం లేద‌ని.. గాయ‌త్రి ఖచ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుందంటున్నాడు ఈ హీరో. మ‌రి.. ఈయ‌న న‌మ్మ‌కం ఎంత‌వ‌ర‌కు నిల‌బ‌డుతుందో..?

User Comments