మైత్రీ నుంచి మోహ‌న్ ఔట్?

మైత్రీ మూవీ మేక‌ర్స్ సంచ‌ల‌న సినిమాలు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. భారీ స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్న నిర్మాణ సంస్థ‌. ముగ్గురు భాగ‌స్వామ‌లుగా మొద‌లైన సంస్థ ఆరంభంలో స్టార్ హీరోలు టార్గెట్ గా సినిమాలు చేసి స‌క్సెస్ అయింది. స్టిల్ అదే దూకుడు కొన‌సాగిస్తోంది. దిల్ రాజు, అల్లు అర‌వింద్, సురే్ష్ బాబు లాంటి దిగ్గ‌జ నిర్మాత‌ల్నే వెన‌క్కి నెట్టిన న‌యా సంస్థ‌. న‌వీన్, ర‌విశంక‌ర్, మోహ‌న్ అనే ముగ్గురు స్నేహితుల క‌ల‌యిక‌తో ఏర్ప‌డిన సంస్థ‌లొ క‌ల‌క‌లం రేగిన‌ట్లు స‌మాచారం. ఈ త్ర‌యం నుంచి మోహ‌న్ అనే నిర్మాత త‌ప్పుకుంటున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. నిజానికి మోహ‌న్ గురించి పెద్ద‌గా తెలియ‌దు.

సినిమా వ్వ‌వ‌హారాలు ముందుడి న‌డిపించేది న‌వీన్, ర‌విశంక‌ర్ మాత్ర‌మే. ప్రాజెక్ట్ హీరోల‌ను సెట్ చేయ‌డం…వాటి నిర్మాణ ప‌నులు ద‌గ్గ‌రుండి చూసుకునేది వీళ్లిద్ద‌రే. మోహ‌న్ అమెరికాలో ఉండి పార్ట‌న‌ర్ గా మాత్ర‌మే కొన‌సాగుతున్నాడు. నేరుగా హైద‌రాబాద్ వ‌చ్చి ఇక్క‌డి ప‌రిస్థితుల గురించి తెలుసుకుంది లేదు. దీంతో మిగ‌తా ఇద్ద‌రి నిర్మాత‌ల‌తో ఎవో మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్తిన‌ట్లు వినిపిస్తోంది. దానికి తోడు మ‌హేష్ -సుకుమార్ మ‌ధ్య ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వ‌డం, వెంట‌నే మైత్రీ నిర్మాత‌లు మ‌హేష్ స్థానంలో బ‌న్నీని తీసుకురావ‌డం వంటి విష‌యాలు మోహ‌న్ కు న‌చ్చ‌లేదుట‌. ఈ రెండు కార‌ణాలుగానే భాగ‌స్వామ్యం నుంచి త‌ప్పుకుంటున్నాడు అనే రూమ‌ర్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం క‌మిట్ అయిన సినిమాలు పూర్తిచేసి ఆర్ధిక‌ లావాదేవీలు అన్నింటిని సెటిల్ చేసుకుని గుడ్ బై చెప్ప‌బోతున్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రి ఇందులోనిజానిజాలు ఏంట‌న్న‌ది తేలాల్సి ఉంది.