ట్రెండీ టాక్‌: క‌లెక్ష‌న్ కింగ్‌ కామెడీలు

Last Updated on by

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ఏపీ ఎన్నిక‌ల ముందు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, తెలుగు దేశం పార్టీ, చంద్ర‌బాబు నాయుడును తీవ్రంగా దుయ్య‌బ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు నాయుడు అన్న గారు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచాడ‌ని అలాంటి వాడిని ఏపీ ప్ర‌జ‌లు అస్స‌లు న‌మ్మొద్ద‌ని ప్ర‌చారం చేశారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో మోహ‌న్ బాబు ఉన్న‌ట్టుండి ప్లేటు ఫిరాయించ‌డానికి కార‌ణ‌మేంటి? అప్ప‌ట్లో చంద్ర‌బాబు వెంట‌నే ఉండి తెలుగు దేశానికి అండ‌గా నిలిచిన మోహ‌న్ బాబు ఎందుకిలా చేస్తున్నారు? అంటే అందుకు కార‌ణ‌మేంటో అంద‌రికీ తెలిసిందే. గ‌త కొంత‌కాలంగా సొంత ఎడ్యుకేష‌న్ సంస్థ‌ తిరుప‌తి శ్రీ విద్యానికేత‌న్ ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ను తేదేపా ప్ర‌భుత్వం చెల్లించ‌డం లేదని ఆయ‌న నిర‌స‌న‌లు తెలియ‌జేస్తున్న సంగ‌తి తెలిసిందే.

గంట‌న్న‌ర పాటు మీడియా లైవ్ లో చంద్ర‌బాబును దోషిని చేసింది ఈ ఫీజు రీఇంబ‌ర్స్ మెంట్ కోస‌మేనా? లేక అన్నీ నిజాలేనా? అని తేదేపా నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. క‌లెక్ష‌న్ కింగ్ కామెడీ షోలేంటో అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. 1994 ఆగ‌స్టు ఎపిసోడ్స్ లో చంద్ర‌బాబు వెంటే ఉన్న మోహ‌న్ బాబు.. గురించి .. అప్ప‌ట్లో మోహ‌న్ బాబు మాట్లాడిన అంశాల గురించి పేప‌క్ క‌టింగ్స్ ని చూపిస్తూ ప్ర‌త్య‌ర్థులు విరుచుకుప‌డుతున్నారు. చంద్ర‌బాబు వ‌ల్ల‌నే మోహ‌న్ బాబుకు రాజ్య‌స‌భ సీటు వ‌చ్చిన సంగ‌తిని గుర్తు చేస్తున్నారు. ఛీఛీ రాజ‌కీయాలు ఇంతేనా.. ? ఎప్పుడూ ఇలా చిల్ల‌ర‌గానే ఉంటాయా? అని తిట్టేస్తున్నారు కొంద‌రైతే. అస‌లు ఒక ప్ర‌యివేటు విద్యాసంస్థ ఫీజు రీఇంబ‌ర్స్ మెంటుకి ఏపీ ప్ర‌జ‌ల‌కు ఏంటి సంబంధం? ఈ రాజ‌కీయాలేంటి? ఎవ‌రు ఎవ‌రిని మోసం చేయ‌ద‌లిచారు? అంటూ మాట్లాడుకుంటున్నారు.

User Comments