లాల్ మ‌రో 100కోట్ల క్ల‌బ్‌

Last Updated on by

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన ప్రయోగాత్మక చిత్రం `ఒడియన్`. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్‌లాల్.. విభిన్నమైన పాత్రలో న‌టించి మెప్పించారు. ఈ సినిమా కోసం మోహన్ లాల్ ఎంతగానో కష్టపడ్డారు. ఆరు పదుల వయసు దగ్గరపడుతున్నప్పటికీ ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం యువకుడిగా కనిపించడానికి వ్యాయామాలు.. యోగాలు అంటూ చాలానే కసరత్తులు చేశారు.

అయితే డిసెంబర్ 14 వతేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రిలీజ్ సమయంలో మిశ్రమ టాక్ ను తెచ్చుకుంది. ఆ తర్వాత టాక్ తో సంబంధం లేకుండా సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టనుంది. రూ.35 కోట్లతో రూపొందిన ఈ ప్రయోగాత్మక సినిమా ఇప్పటివరకు రూ.90 కోట్ల గ్రాస్ మించినట్లు చిత్రయూనిట్ తెలిపింది. డైరెక్టర్ శ్రీకుమార్ మీనన్ మాట్లాడుతూ.. మాస్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా `పులిమురుగన్` సినిమాను బీట్ చేయనుందని అంటున్నారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుందని తెలిపారు. దీన్నిబట్టి మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోనుందని సినీ క్రిటిక్స్ వెల్లడిస్తున్నారు. కాగా మలయాళంతో పాటు తెలుగు.. తమిళ భాషల్లో డిసెంబర్ 14న రిలీజైన ఈ సినిమా 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం విశేషం. మలయాళంలో ఈ స్థాయి బిజినెస్ చేసిన మొదటి సినిమా కూడా ఇదే. గ్రామీణ నేపథ్యంలో సాగిన కథ.. డిఫరెంట్ లుక్స్ తో.. సూపర్ పవర్స్ కలిగిన యోధుడిగా ఈ సినిమాలో మోహన్ లాల్ కనిపించారు. మంజు వారియర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో ప్రకాశ్ రాజ్ నటించారు.

User Comments