1000 కోట్లతో భీముడి సినిమా

Last Updated on by

మ‌హాభార‌తంలోని భీముని పాత్ర ఆధారంగా ఓ సినిమాలో న‌టిస్తాన‌ని మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్‌ మోహ‌న్‌లాల్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో దుబాయ్‌కి చెందిన బి.ఆర్‌.శెట్టి అనే బిజినెస్ టైకూన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తార‌ని, గ‌త వేస‌విలోనే లాల్ ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఆ సినిమాని గురుపౌర్ణ‌మి వేళ ప్రారంభించారు. భార‌తంలో భీముడి పాత్ర‌ ఆధారంగా ఎం.టి.వాసుదేవ‌న్ ర‌చించిన న‌వ‌ల‌ `రంద‌మూజ‌మ్` ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.

ఇది భార‌త‌దేశంలోనే కాదు, ఆసియాలోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న సినిమా. ఈ భారీ చిత్రాన్ని రెండు భాగాలుగా తెర‌కెక్కించ‌నున్నారు. లాంచింగ్‌ విష‌యాన్ని మోహ‌న్‌లాల్ అధికారికంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ఆసియాలోనే ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమా ప్రారంభించినందుకు లాల్‌కి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. లాల్ మ‌రో భారీ బ‌డ్జెట్ చిత్రం `ఓడియ‌న్‌`లో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌గ‌లు మ‌నిషి, రాత్ర‌యితే క్రూర జంతువుగా మారిపోయే మ‌ల‌యాళ‌ ఫిక్ష‌న్ క‌థ‌తో తెర‌కెక్కుతున్న సినిమా ఇది.

User Comments