ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మోక్ష్‌?

Last Updated on by

2017లోనే న‌ట‌సింహా బాల‌కృష్ణ న‌ట‌వార‌సుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఇస్తాడ‌న్న ప్ర‌చారం సాగింది. నంద‌మూరి కాంపౌండ్ పీఆర్‌వోలు దీనిపై హింట్లు కూడా ఇచ్చారు. మోక్ష‌జ్ఞ‌కు న‌ట‌శిక్ష‌ణ‌, డ్యాన్సులు, ఫైట్స్‌లో శిక్ష‌ణ ఇస్తున్నార‌ని, ఇక ఈ ఏడాది హీరోగా ఎంట్రీ ఇచ్చేస్తాడ‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం సాగించారు. అయితే 2018 మిడిల్‌కి వ‌చ్చినా ఇంకా మోక్షు ఎంట్రీ గురించిన స‌రైన అప్‌డేట్ లేదు. అయితే ప‌దునెక్కిన క‌త్తిలా అత‌డు అన్నిటికీ ప్రిపేర్డ్‌గా ఉన్నాడ‌న్న స‌మాచారం మాత్రం ప‌క్కాగా ఉంది. మోక్ష్‌ ఈ ఏడాదిలోనే తెరంగేట్రం చేసేందుకు ఛాన్స్ ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. దేశంలోనే ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌క బ‌యోపిక్‌గా చెబుతున్న `ఎన్టీఆర్‌` చిత్రంలో మోక్ష‌జ్ఞ ఓ కీల‌క పాత్ర పోషించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇందులో నూనూగు మీసాల‌ ఎన్టీఆర్‌గా మోక్షు క‌నిపిస్తాడ‌ట‌. నూనూగు మీసాల ఎన్టీఆర్ అన‌గానే నిమ్మ‌కూరులో బాల‌కుడైన ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ త‌మ ఇంటికి వ‌చ్చి పాలు అమ్మే అమ్మాయికి లైనేశాడ‌ని, ప‌న‌మ్మాయికి సైట్ కొట్టేవాడ‌ని, వ‌య‌సొచ్చిన పొగ‌రు గిత్తలా ఉండేవాడ‌ని.. నంద‌మూరి అభిమానుల్లో చ‌ర్చ ఉంది. ఇప్పుడు మోక్ష‌జ్ఞ ఆ చిలిపి క‌న్న పాత్ర‌లోనే న‌టిస్తాడ‌ని భావిస్తున్నారు. నిమ్మ‌కూరులో ఎన్టీఆర్ వ్య‌వ‌హారాలు మోక్ష‌జ్ఞ అభిన‌యించాలంటే కొంత శిక్ష‌ణ కూడా అవ‌స‌రం. అందుకే ప్ర‌స్తుతం సింగ‌పూర్‌లో లుక్ ఛేంజ్ శిక్ష‌ణ‌తో పాటు న‌ట‌శిక్ష‌ణ తీసుకుంటున్నాడ‌ట‌. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చిత్రానికి అసిస్టెంట్‌గా ప‌ని చేశాడు కాబట్టి మోక్ష‌జ్ఞ బాడీ లాంగ్వేజ్ తెలిసిన క్రిష్ ఆ పాత్ర‌కు త‌న‌నే ఎంపిక చేశాడ‌ట‌. ఇంట్రెస్టింగ్.. హిలేరియ‌స్ డెబ్యూ ప్లాన్ అనే చెప్పాలి.

User Comments