మోక్ష‌జ్ఞ కొత్త ఫోటో.. మ‌ళ్లీ అదే ప్ర‌చారం

నంద‌మూరి వార‌సుడు.. న‌ట‌సింహ బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీపై ఇప్ప‌టికే ఉత్కంఠ నెల‌కొంది. మోక్షు 2016లోనే హీరోగా సినీఎంట్రీ ఇస్తున్నాడ‌ని ప్ర‌చార‌మైంది. కానీ 2020 వ‌చ్చేస్తున్నా ఇంకా అభిమానుల్లో డైల‌మా కొన‌సాగుతూనే ఉంది. క‌నీసం 2020లో అయినా ఎంట్రీ ఉంటుందా? అంటే.. ప్చ్! అనేస్తున్నారు తాజా ఫోటో చూసిన ఫ్యాన్స్.

అయితే ప‌రిశ్ర‌మ‌లో మాత్రం మోక్ష‌జ్ఞ ఎంట్రీ తొంద‌ర్లోనే ఉంటుంద‌న్న ప్ర‌చారం ఇప్ప‌టికే ఉంది. ఓ వైపు మోక్షజ్ఞ‌ ఎంట్రీ కోసం బాల‌య్య స‌రైన స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నార‌ని.. విదేశాల్లో మోక్షజ్ఞ‌ న‌ట‌న‌పై శిక్ష‌ణ తీసుకుంటున్నాడ‌ని ర‌క‌ర‌కాల వార్త‌లొచ్చాయి. అటుపై ఓ ఈవెంట్లో మోక్ష‌జ్ఞ కొత్త రూపం చూసి మోక్ష‌జ్ఞ సినిమాల విష‌యంలో ఆస‌క్తిగా లేడ‌ని… హీరో అయ్యే అవ‌కాశమే లేద‌ని అంతే బ‌లంగా క‌థ‌నాలు వ‌చ్చాయి. తాజాగా మోక్ష‌జ్ఞ‌ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దిగిన ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది.

ఈ ఫోటో చూసిన‌ అభిమానులు.. టాలీవుడ్ మీడియా సైతం అవాక్కైంది. అందులో మోక్షజ్ఞ‌ బొద్దుగా క‌నిపిస్తున్నారు. పైగా ఆకృతి ప‌రంగా ఏమాత్రం ప్ర‌య‌త్నం లేద‌ని అర్థ‌మ‌వుతోంది. తాజా ఫోటో లీక్ తో మ‌రోసారి మీడియా స‌హా అభిమానుల్లో సందేహం మొద‌లైంది. ఇప్ప‌ట్లో మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఉంటుందా? అస‌లు త‌ను సినిమాల‌పై ఆస‌క్తిగా ఉన్నాడా? లేదా? అన్న ప్ర‌శ్న మ‌రోసారి అభిమానుల్లో రైజ్ అవుతోంది. ఈ ఫోటోను బ‌ట్టి ఇప్ప‌టివ‌ర‌కూ మోక్ష‌జ్ఞ మేకోవ‌ర్ ప్ర‌య‌త్న‌మే చేయ‌లేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అలాంటి ప్ర‌య‌త్నాలు చేసుంటే త‌న‌కు ఈ బెల్లి లుక్ వ‌చ్చేది కాద‌ని అంటున్నారు. మ‌రి ఈ ప్ర‌చారానికి మోక్ష‌జ్ఞ‌ ఎప్పుడు పుల్ స్టాప్ పెడ‌తాడో చూద్దాం.