ఆదిత్మ 369 రీమేక్ తో మోక్ష‌జ్ఞ ఎంట్రీ!

న‌ట‌సింహ బాల‌కృష్ణ ముద్దుల త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఖ‌రారైందా? 2020 లో మోక్ష‌జ్ఞ నంద‌మూరి ప్రేక్ష‌కాభిమానుల‌ను ప‌ల‌క‌రించ‌నున్నాడా? అంటే అవున‌నే తెలుస్తోంది. కొద్ది సేప‌టి క్రిత‌మే దానికి సంబంధించిన ఓ వార్త నంద‌మూరి ఫ్యామిలీ స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీకైంది. మోక్ష‌జ్ఞ ఎంట్రీపై ఇప్ప‌టికే చాలాసార్లు ప్ర‌చారం సాగింది. కానీ ఈసారి ఆ కాంపౌండ్ నుంచి బ‌ల‌మైన వ్య‌క్తుల ద్వారా ఎంట్రీ వార్త బ‌ట‌కు రావ‌డం విశేషం. పూరి జ‌గ‌న్నాథ్ బోయ‌పాటి శ్రీను, క్రిష్, వినాయ‌క్ ఇలా ప‌లువురి పేర్లు వినిపించినా చివ‌రిగా క్రిష్ కే బాల‌య్య ఓటేసిన‌ట్లు చెబుతున్నారు. బాల‌య్య కెరీర్ మైల్ స్టోన్ మూవీగా నిలిచిన `ఆదిత్య 369` సీక్వెల్ కు బ‌ధులుగా అదే చిత్రాన్ని రీమేక్ చేయాల‌నే బాల‌య్య నిర్ణ‌యం తీసుకున్నారుట‌.

వాస్త‌వానికి ఈ చిత్రానికి సీక్వెల్ గా సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలోనే బాల‌య్య సినిమా చేయాల‌నుకున్నారు. కానీ త‌న‌యుడు కోస‌మే బాల‌య్య ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నార‌ని ఈ సంద‌ర్భంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే క్రిష్ ఆ సినిమా రీమేక్ ప‌నులు కూడా మొద‌లుపెట్టార‌ని స‌మాచారం. ఈ సినిమా కోసం బాలీవుడ్ రైట‌ర్లల‌లో టెక్నిక‌ల్ అంశాల‌పై ఎక్కువ‌గా గ్రిప్ ఉన్న వాళ్ల‌ను తీసుకోవాల‌ని చూస్తున్నారుట‌. తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. వాస్త‌వానికి క్రిష్ సినిమాల‌న్నింటికి సాయి మాధ‌వ్ బుర్రా డైలాగులు అందిస్తారు. కానీ టైమ్ మిష‌న్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కావడంతోనే ఆయ‌న్ని ప‌క్క‌న‌బెట్టార‌ని తెలుస్తోంది. 2020 లో సినిమా ప్రారంభోత్స‌వం ఉంటుంద‌ని అంటున్నారు. వీట‌న్న‌టింకి సంబంధించిన పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు అధికారికంగా వెల్ల‌డించ‌నున్నార‌ని స‌మాచారం.

Also Read: Bollywood Actress For Akash Puri’s Next