మ‌ల్లూ గాళ్స్‌కి ముచ్చెమ‌ట‌లే!

Last Updated on by

టాలీవుడ్‌లో మ‌ల్లూ గాళ్స్ వెల్లువ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు. న‌య‌న‌తార‌, మీరా జాస్మిన్, అసిన్, నిత్యామీన‌న్‌, అమ‌ల‌పాల్, కేథ‌రిన్ థ్రెసా వంటి టాప్ హీరోయిన్స్ కేర‌ళ నుంచి త‌ర‌లి వ‌చ్చిన‌వారే. న‌వ‌త‌రంలో కీర్తి సురేష్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, నివేధ థామ‌స్, న‌మిత ప్ర‌మోద్‌ వంటి నాయిక‌లు హ‌వా సాగిస్తున్నారు. అయితే మునుముందు ఈ భామ‌ల‌కు తీవ్ర‌మైన కాంపిటీష‌న్ ఇరుగుపొరుగు భాష‌ల నుంచి ఎదురు కానుంది.

కేవ‌లం కేర‌ళ బేస్డ్ మాత్ర‌మే కాకుండా ఇటు బెంగ‌ళూరు, పూణే, గోవా, కోల్‌క‌త‌, దిల్లీ, హైద‌రాబాద్ వంటి మెట్రో న‌గ‌రాల నుంచి క‌థానాయిక‌ల వెల్లువ పెర‌గ‌నుంది. ఆయా న‌గ‌రాల్లో ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్‌పై అవ‌గాహ‌న పెరుగుతోంది కాబ‌ట్టి ముంబై త‌ర‌హాలోనే క‌థానాయిక‌ల వెల్లువ అంత‌కంత‌కు పెరుగుతోంది. ప్ర‌స్తుతం మాళ‌విక నాయిర్ చెన్న‌య్ నుంచి మ‌ల్లూవుడ్ వెళ్లి స‌త్తాచాటి, అట్నుంచి టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇక్క‌డ ఏకంగా ప‌లు క్రేజీ చిత్రాల్లో అవ‌కాశాలు అందుకుంటోంది. మెగా అల్లుడు క‌ళ్యాణ్‌దేవ్ స‌ర‌స‌న `విజేత‌`లో, విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న `ట్యాక్సీవాలా` చిత్రాల్లో న‌టించిన ఈ భామ‌, ఇదివ‌ర‌కూ మ‌హాన‌టిలోనూ న‌టించింది. ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌న‌ని సంప్ర‌దిస్తున్నార‌ట‌. అలానే అక్కినేని నాగ‌చైత‌న్య‌, అఖిల్ స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకున్న నిధి అగ‌ర్వాల్ హైద‌రాబాద్‌లో పుట్టి, అటు ఉత్త‌రాదిన ఫేమ‌స్ అయ్యింది. బాలీవుడ్‌లో క‌థానాయిక‌గా ప్ర‌వేశించి తెలుగులో అవ‌కాశాలు అందుకుంటోంది. ఉత్త‌రాది టాప్ మోడ‌ల్ మాళ‌విక శ‌ర్మ ర‌వితేజ నేల టిక్కెట్టు తో ప‌రిచ‌య‌మై, నాగార్జున‌- నాని మ‌ల్టీస్టార‌ర్‌లో అవ‌కాశం అందుకుంది. ఇక ముంబై భామ‌లు పూజా హెగ్డే, అమైరా ద‌స్తూర్ వంటి నాయిక‌ల నుంచి అడ‌పాద‌డ‌పా పోటీ త‌ప్ప‌డం లేదు. హైద‌రాబాదీ గాళ్ ఇషా రెబ్బా ఇక‌మీద‌ట పెద్ద స్టార్ల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటోంది. పాల‌మూరు బేబి(హైద‌రాబాద్‌) పేరున్న‌ అదితీరావ్ హైదారీ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో ఇత‌ర నాయిక‌ల‌కు పోటీ ఇవ్వ‌నుంది. మ‌రికొంత‌మంది క‌థానాయిక‌లు హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నారిక్క‌డ‌. వీళ్లంద‌రి నుంచి మ‌ల్లూ భామ‌లైన కీర్తిసురేష్‌, అనుప‌మ వంటి వారికి పోటీ త‌ప్ప‌దు.

User Comments