మల్లూవుడ్ ఇకపై చిన్నది కాదు..

మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీ అంటే ఏదో తెలియ‌ని చిన్న‌చూపు ఉంటుంది. అక్క‌డి సినిమాలు క‌నీసం 10 కోట్లు కూడా దాట‌వు.. అవేం సినిమాలు.. అదేం ఇండ‌స్ట్రీ అనుకునేవాళ్ళు రెండేళ్ల కింది వ‌ర‌కు. కానీ ఇప్పుడు ఆ మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీనే రికార్డులు తిర‌గ‌రాస్తుంది.

అక్క‌డే చ‌రిత్ర‌కు నాందీ ప‌డుతుంది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 1000 కోట్ల ప్రాజెక్ట్ అక్క‌డే రూపు దిద్దుకుంటుంది. గ‌త రెండు మూడేళ్ల‌లో దృశ్యం.. ప్రేమ‌మ్.. పులిమురుగ‌న్ లాంటి సినిమాలు 100 కోట్ల‌కు చేరువ‌గా వ‌సూలు చేసాయి. తాము కూడా ఇత‌ర ఇండ‌స్ట్రీల‌కు ఏ మాత్రం తీసిపోం అని నిరూపిస్తున్నారు అక్క‌డి హీరోలు. ఇక ఇప్పుడు మోహ‌న్ లాల్ వెయ్యి కోట్ల‌తో రాండ‌మూలం క‌థ చేస్తున్నాడు. ఇది భీముడి కోణంలో సాగే మహాభారతం.

శ్రీ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో క‌ర్ణుడిగా నాగార్జున‌.. అర్జునుడిగా విక్ర‌మ్.. భీష్ముడిగా అమితాబ్ న‌టించ‌బోతున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం 2020లో విడుద‌ల కానుంది. ఇదిలా ఉండ‌గానే 200 కోట్ల‌తో మ‌మ్ముట్టి మ‌మాంకం అనే ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసాడు. 17వ శతాబ్ధానికి చెందిన ఓ వ‌ల్ల‌వ‌నాడు చెవ‌రెకుల్ రాజు క‌థ ఇది. డ‌చ్ దేశస్థుల‌ను కేర‌ళ నుంచి వెళ్ల‌గొట్టిన మ‌హావీరుడి క‌థ ఇది. దీన్ని కొత్త ద‌ర్శ‌కుడు సంజీవ్ పిళ్లై తెర‌కెక్కిస్తున్నాడు. మొత్తానికి ఇప్పుడు మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీ కేరాఫ్ పెద్ద సినిమాలుగా మారిపోయింది.

Follow US