ఉదయం ఆట ఉచితం

Last Updated on by

ఆమ‌ని కీల‌క పాత్ర‌ పోషించిన‌ ఐపీసీ సెక్షన్ భార్యాబంధు ఈనెల 29న విడుదలవుతోంది.శరత్ చంద్ర-నేహా దేశ్ పాండే జంట‌గా.. రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వ ంలో ఆలూరి క్రియేషన్స్ పతాకంపై ఆలూరి సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చ‌టించిన‌ ఆమని సినిమా గురించి మాట్లాడుతూ .. పెళ్లయినవాళ్లతోపాటు, పెళ్లికావాల్సినవాళ్లంతా తప్పక చూడాల్సిన సినిమా ఇద‌ని అన్నారు. పెద్ద హీరోల సినిమాలు చేస్తూ.. కొత్త హీరో సినిమా ఎందుకని తొలుత అనుకున్నా.. ఈ సినిమా చేయకపోతే ఒక నటిగా మంచి సినిమా మిస్ అయేదాన్ని. ఐపీసీ సెక్షన్ భార్యాబంధు వివాహ బంధంలో గొప్పతనం తెలుసుకోక.. చాలా చిన్న చిన్న కారణాలకే ఈ రోజుల్లో ఎన్నో జంటలు విడిపోతున్నాయి. ఇందులో స్వాతి శ్రీపాద అనే రైటర్ కమ్ కౌన్సిలర్ గా నటించాను. ద‌ర్శ‌కుడు శ్రీవివాస్ రెట్టాడి ప్రతి సన్నివేశాన్ని ఏంతో హృద్య ంగా చిత్రీక‌రించారు. చక్కని సందేశానికి చిక్కని వినోదం జోడించి రూపొందించారు .. అని తెలిపారు.

ఐపీసీ సెక్షన్ భార్యాబంధు ద‌ర్శ‌కుడు రెట్ట‌డి శ్రీ‌నివాస్ మాట్లాడుతూ- ఈ సినిమా రిలీజ్‌రోజు ఉద‌యం ఆట ఉచిత‌మ‌ని ప్ర‌క‌టించారు. నిర్మాత ఆలూరి సాంబశివరావు చ‌క్క‌ని నిర్ణయం తీసుకున్నార‌ని, న‌చ్చితే పదిమందికి చెబుతారనే నమ్మకంతోనే ఈ ఆఫర్ ఇస్తున్నామని శ్రీనివాస్ అన్నారు. మహిళల రక్షణ కోసం చేసిన చట్టాలను కొందరు మహిళలు ఎలా దుర్వినియోగం చేస్తున్నారు? అనేది తెర‌పై చూపాం. సందేశభరిత వినోదాత్మక చిత్రమిది. మెగాస్టార్ చిరంజీవి నటించిన అభిలాష తర్వాత భారత రాజ్యాంగంలోని ఒక సెక్షన్ ని బేస్ చేసుకొని రూపొందిన చిత్ర‌మిది.. అని తెలిపారు. ఆమ‌ని న‌ట‌న ఆక‌ట్టుకుంటుంద‌ని అన్నారు.

User Comments