`మా` కొత్త అధ్య‌క్షుడు న‌రేష్ .. 69 ఓట్ల‌తో గెలుపు!

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల ఫ‌లితం వెలువ‌డింది. `మా` కొత్త అధ్య‌క్షుడిగా సీనియ‌ర్ న‌రేష్ బాధ్య‌త‌ల్ని స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా `మా` మాజీ అధ్య‌క్షుడు శివాజీ రాజా కొత్త అధ్యక్షుడికి బాధ్య‌త‌లు అప్ప‌గించి శుభాకాంక్ష‌లు తెలిపారు. నరేశ్.. శివాజీరాజా ప్యానళ్ల మధ్య హోరాహోరీ లో 69 ఓట్ల తేడాతో న‌రేష్ .. శివాజీ రాజాపై గెలుపొందారు. న‌రేష్ ప్యానెల్ త‌ర‌పున జీవిత‌, రాజ‌శేఖ‌ర్ గెలుపొందారు. ఈసారి ఎన్నిక‌ల్లో ఈవీఎంల‌ స్థానంలో బ్యాలెట్ ని ఉప‌యోగించారు.

కొత్త ప్యానెల్ వివ‌రాలు ప‌రిశీలిస్తే… అధ్యక్షుడు-నరేశ్, జ‌నరల్ సెక్రటరీ-జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్య‌క్షులు- రాజశేఖర్, ఉపాధ్యక్షులు 1 – ఎస్వీ కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు 2 -హేమ (ఇండిపెండెంట్), కోశాధికారి- రాజీవ్ కనకాల, జాయింట్ సెక్రటరీలు – గౌతం రాజు.. శివబాలాజీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సభ్యులు- అలీ, రవిప్రకాశ్, తనికెళ్ల భరణి, సాయికుమార్, ఉత్తేజ్, పృథ్వి, జాకీ, సురేశ్ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్, సమీర్, ఏడిద శ్రీరామ్, వేణుమాధవ్, పసునూరి శ్రీనివాస్‌, రాజా రవీంద్ర, తనీష్, జయలక్ష్మి, కరాటి కల్యాణి త‌దిత‌రులు గెలుపొందారు. గెలుపొందిన వారిలో శివాజీ రాజా ప్యానెల్ నుంచి ర‌వి ప్ర‌కాష్‌, ఏడిద శ్రీ‌రామ్, సురేష్ కొండేటి, అనితా చౌద‌రి, వేణుమాధ‌వ్ త‌దిత‌రులు ఉన్నారు.

Also Watch:Maa Elections Result