రాజ‌మౌళి 999 అంటే?

సురేష్ ,కార్తీక్ ,శ్రీబాలా ,నాయుడు , నగేష్ ప్రధాన పాత్రధారుల్లో భార్గ‌వి క్రియేష‌న్స్ పై ఆర్ . కె ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తోన్న ఇండిపెండెంట్ చిత్రం “రాజమౌళి-999”. యాన్ అంటోల్డ్ స్టోరీ ఆఫ్ సినిమా అనేది ట్యాగ్ లైన్ . తొలిసారి పూర్తిగా సినిమా ఇండ‌స్ర్టీ బ్యాక్ డ్రాప్ తో యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్ర‌మిది. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చిందని మిగ‌తా ప్ర‌చార చిత్రాల‌కు నెటి జ‌నుల నుంచి రెస్పాన్స్ బాగుందని యూనిట్ సభ్యులు తెలిపారు.

ఇందులో దర్శకుడు ఆర్ .కె సినీ ప్రపంచంలో జరిగే మోసాలను సున్నితమైన అంశాలను సూటిగా సుత్తి లేకుండా ప్ర‌స్థావించిన‌ట్లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే సోష‌ల్ మీడియాలో ట్రైల‌ర్ ఒక మిలియ‌న్ వ్యూస్ దాటిన‌ట్లు యూనిట్ సంతోషం వ్య‌క్తం చేసింది. సినిమా కూడా ఆద్యంతం ఆస‌క్తిరంగా ఉంటుంద‌ని, తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేసారు. ఈ చిత్రానికి సంగీతం : ప్ర‌భంజ‌న్, ఛాయాగ్ర‌హ‌ణం: ప్రసాద్ చందన్, ఎడిటర్ : ఉదయ్ రమేష్, వాయిస్ ఓవర్ :జై శ్రీనివాస్ ర‌చయిత ,దర్శకత్వం : ఆర్ . కె.