మిస్ట‌ర్ మ‌జ్ను ఫిలింన‌గ‌ర్ టాక్

Last Updated on by

రిలీజ్ ముందే త‌మ పాఠ‌కులు, ట్రేడ్ కి వంద శాతం న‌మ్మ‌శ‌క్య‌మైన ఫిలింన‌గ‌ర్‌ టాక్ ని వెల్ల‌డిస్తోంది `మై ఫ‌స్ట్ షో`. ఇటీవ‌ల రిలీజైన హుషారు, ప‌డి ప‌డి లేచే మ‌న‌సు, అంత‌రిక్షం, కెజిఎఫ్‌, ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు, విన‌య విధేయ రామ‌, ఎఫ్ 2 వంటి చిత్రాల ఇన్ సైడ్ ఫిలింన‌గ‌ర్ టాక్‌ని ముందే వెల్ల‌డించాం. మై ఫ‌స్ట్ షో అందించిన రిపోర్ట్ ప్ర‌కార‌మే.. బాక్సాఫీస్ రిజ‌ల్ట్ ప్ర‌తిబింబించింది. తాజాగా `మిస్ట‌ర్ మ‌జ్ను`పైనా రిపోర్ట్ ఇది. అఖిల్ కెరీర్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం మిస్ట‌ర్ మ‌జ్ను ఫిలింన‌గ‌ర్ టాక్ ఎలా ఉంది అంటే..!?

అత్యంత సన్నిహితుల స‌మాచారం ప్ర‌కారం.. అఖిల్ కి మ‌రోసారి నిరాశ త‌ప్ప‌ద‌నే తెలుస్తోంది. `మిస్ట‌ర్ మ‌జ్ను`కి సెకండాఫ్ పెద్ద మైన‌స్… అభిమానులే త‌ట్టుకోలేనంత ఇదిగా కంటెంట్ ఉంటుందిట‌. అక్కినేని అభిమానుల‌ను ఇది నిరాశ‌ప‌రుస్తుంద‌ని చెబుతున్నారు. అంతేకాదు ఈ చిత్రం తిరిగి యువ‌హీరో తొలి సినిమా `అఖిల్ – ది ప‌వ‌ర్ ఆఫ్ జువా`ని గుర్తు చేయ‌బోతోందిట‌. రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 25న ఈ చిత్రం రిలీజ‌వుతోంది. మ‌రో నాలుగు రోజుల్లోనే ఫ‌లితం తేల‌నుంది. నేడు సెన్సార్ పూర్త‌యింది. ఎలాంటి క‌ట్స్ లేకుండా సెన్సార్ బృందం యుఏ స‌ర్టిఫికెట్‌ని ఇచ్చింది.

User Comments