ట్రైల‌ర్: మిస్ట‌ర్ మ‌జ్ను టాక్

అక్కినేని అఖిల్ న‌టిస్తున్న మూడో సినిమా మిస్ట‌ర్ మ‌జ్ను. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌. ఈనెల 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా రిలీజ‌వుతోంది. నేడు ఈ సినిమా ట్రైల‌ర్ ని హైద‌రాబాద్ లో లాంచ్ చేశారు. ట్రైల‌ర్ ఎలా ఉంది? అంటే..
ఈ ట్రైల‌ర్ ఆద్యంతం అక్కినేని స్టైల్ రొమాంటిక్ ల‌వ్ స్టోరి ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ట్రైల‌ర్ లో అఖిల్ య‌థావిధిగానే స్టైలిష్ గా క‌నిపించాడు. నిధి అగ‌ర్వాల్ హాట్ అప్పీల్ ఆక‌ట్టుకుంది. అమ్మాయిల వెంట‌ప‌డే అల్ల‌రి కుర్రాడు విక్కీ నిధిని ప‌డేసేందుకు ఎలాంటి టెక్నిక్స్ ఉప‌యోగించాడు?  చివ‌రికి త‌న‌కు చేత‌కాని ప్రేమ వ‌ల‌లో చిక్కుకుని ఎలా విల‌విల‌లాడాడు? అన్న థీమ్ తో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిద‌ని ట్రైల‌ర్ చెబుతోంది. అఖిల్ ఎప్ప‌టిలానే హార్డ్ వ‌ర్క్ చేసిన సంగ‌తి అర్థ‌మ‌వుతోంది. నిధి అగ‌ర్వాల్ అంద‌చందాలు అస్సెట్ కానున్నాయి. ఇక వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని ఏ స్థాయిలో ఎమోష‌నల్ ల‌వ్ స్టోరిగా తీర్చిదిద్దాడు? అన్న‌దానిని బ‌ట్టే విజ‌యం ఆధార‌ప‌డి ఉంటుంది. ఇక ట్రైల‌ర్ లో ఎక్క‌డా ఎమోష‌న్ అన్న‌ది వ‌ర్క‌వుట్ కాలేదు. కానీ రొమాంటిక్ మూడ్ ని మాత్రం క్యారీ చేస్తోంది. మ‌రి ఈ మ‌జ్ను క‌థేంటో ఈనెల 25న తెలుస్తుంది. అంత‌వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.