మిస్ట‌ర్ మ‌జ్ను మ‌హా ర‌సికుడు

దేవ‌దాసు మ‌న‌వ‌డు, మ‌న్మ‌ధుడికి వార‌సుడు .. బ‌రిలో దిగాడు. ఇన్నాళ్లు వేచి చూసిన స‌స్పెన్స్ వీడింది. అఖిల్ 3 టైటిల్‌ `మిస్ట‌ర్ మ‌జ్ను`. ఫ‌స్ట్‌లుక్ ఫెంటాస్టిక్‌. కొన్ని సెక‌న్ల టీజ‌ర్ మైమ‌రిపించింది. అక్కినేని బ్రాండ్ అంటే ఏంటో అఖిల్ ఇన్నాళ్టికి ఎలివేట్ చేశాడు. అఖిల్‌, హ‌లో చిత్రాల త‌ర్వాత అత‌డి దిష్టి తొల‌గిపోయిన‌ట్టే. ఈసారి ష్యూర్ షాట్ హిట్ కొట్టేయ‌బోతున్నాడ‌న్న పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.

అక్కినేని హీరోలోని కొత్త కోణం ఆక‌ట్టుకుంది. అక్కినేని ఫ్యామిలీ బ్రాండ్‌ని తెర‌పై చూపించే ప్ర‌య‌త్న‌మే సాగుతోంది. మిస్ట‌ర్ మ‌జ్ను టైటిల్‌కి త‌గ్గ‌ట్టే మ‌గువ‌ల‌తో అఖిల్ స‌ర‌స స‌రాగాలు టీజ‌ర్‌లో ఆక‌ట్టుకున్నాయి. నాగార్జున త‌ర్వాత అఖిల్‌కి మాత్ర‌మే చెల్లిన ఆ రొమాంటిక్ కోణాన్ని తెర‌పై చూపిస్తున్నాడు వెంకీ కుడుముల‌. కావ్య ంలో కాముడో అంత‌క‌న్నా ర‌సికుడో ఈ మిస్ట‌ర్ మ‌జ్ను? అంటూ ర‌చ్చ చేశాడు. ఎక్స్‌క్యూజ్‌మి మిస్.. ఏమిటో ఇంగ్లీష్ భాష … ఏదైతే మిస్ చేయ‌కూడ‌దో దాన్నే మిస్ అన్నారు.. అంటూ అదిరిపోయే డైలాగ్‌తో ఆక‌ట్టుకున్నాడు అఖిల్. ముఖ్య ంగా థ‌మ‌న్ బీట్ అదిరిపోయింది. ది బెస్ట్ యూత్‌ఫుల్ సినిమాని ఈ టీమ్ అందిస్తోంది. బివిఎస్ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్‌లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం.