ఎక్కువైన అందం – మరీ అంతలా  ఆరబోయాలా..

much exposing Regina Pragya Nakshatram

సినిమా అంటేనే గ్లామరస్ ఫీల్డ్ అని అర్ధం.  అందానికి కేరాఫ్ సినిమాలు ఇప్పటి వరకు బాలీవుడ్ అని తెలుసు.  కానీ, ఆ సంస్కృతి ఇప్పుడు టాలీవుడ్ కు కూడా పాకింది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు మడి కట్టుకొని కూర్చున్న చాలామంది భామలు ఇటీవల కాలంలో సినిమాల కోసం కావలసినంత ఆరబోస్తున్నారు. కంచె సినిమాలో హోమ్లీగా కనిపించిన ప్రగ్య జైశ్వాల్వ్ ఇటీవల విడుదలైన నక్షత్రం సినిమాలో ఒక్కసారిగా రెచ్చిపోయింది.  ఆర్ధిక సమస్యలతో సతమతమౌతున్న నక్షత్రం సినిమాను గట్టెక్కించేందుకు ఒకవైపు అందులో నటించిన సాయి ధరమ్ తేజ్, ప్రకాష్ రాజ్, శివాజీరాజా, గడ్డం చక్రవర్తి వంటివారు డబ్బులు తీసుకోకుండా నటిస్తే.. తమ అందచందాలను మరింతగా ఆరబోసి సినిమాకు ప్రేక్షకులను రప్పించాలనే ప్రయత్నంతో పాపం ప్రగ్య ఎక్స్ పోజింగ్ కు ఏ మాత్రం అడ్డు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టుగా అందాలను ప్రదర్శించింది.
కృష్ణవంశి సినిమాల్లో అమ్మాయిలను అందంగా చూపిస్తారు అనడంలో సందేహం లేదు.  కానీ, ఎప్పుడు లిమిట్ దాటలేదు.  మరెందుకో నక్షత్రంలో ఆ లిమిట్ దాటాడు.  పైగా ప్రగ్య, రెజీనాలు కూడా బాగా కో ఆపరేట్ చేశారు. అంతగా కో ఆపరేట్ చేసినా.. సినిమాలో పస లేకపోవడంతో.. సినిమా ఫట్ అయింది. అదనంగా అందాలు ప్రదర్శించినందుకు మాములుగా అదనంగా పారితోషికం తీసుకుంటారు.  కానీ, ప్రగ్య, రెజీనాలు అలాంటి పనిచేయలేదు.  కేవలం నాలుగోవంతు పారితోషికం మాత్రమే తీసుకున్నారట.  అంటే, పాపం నక్షత్రం కోసం వారి వొంతు సహాయం వారు చేశారు.  ఫైనల్ గా మాత్రం సినిమా ఆడకపోవడంతో.. అందాల ప్రదర్శన అంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది.  పోనీలే రెజీనా అందాలను చూసి మరో దర్శకుడు అవకాశం ఇవ్వకపోతాడా.. ప్రగ్య మెరుపులు చూసి అవకాశాలు రాకపోతాయా.. చూద్దాం.