త‌ల‌కాయ‌తో పోలీస్ స్టేష‌న్ కి!

న‌ల్గొండ జిల్లా నాంప‌ల్లి మండ‌లంలో దారుణం జ‌రిగింది. శ‌నివారం సాయంత్ర ఓ యువ‌కుడు దారుణ హ‌త్య‌కు గురైన ఘ‌ట‌న ఎస్సీ కాల‌నీలో చోటు చేసుకుంది. న‌ల్గొండ జిల్లా అనుముల మండ‌లం మారెప‌ల్లి గ్రామానికి చెందిన ఎండీ గౌస్ కు సోద‌రి వ‌రుసైన ఓ మ‌హిళ ఉండేది. ఆమె భ‌ర్త కోన్నేళ్ల క్రితం చ‌నిపోయాడు. ఆ త‌ర్వాత నాప‌ల్లి మండ‌లం నెరెల్ల ప‌ల్లి గ్రామానికి చెందిన స‌ద్దాం అనే ఆటో డ్రైవ‌ర్ ఆమెను హైద‌రాబాద్ తీసుకెళ్లాడు. కొన్నాళ్లు ఇద్ద‌రు స‌హ‌జీవనం చేసారు. ఈ క్ర‌మంలో గ‌తేడాది ఆమె అనుమానాద‌స్ప‌దంగా మృతి చెందింది.

దీంతో త‌మ‌కు సోదైర‌న మ‌హిళ‌ను స‌ద్దాం చంపాడ‌న్న నెపంతో అత‌నిపై ఇర్పాన్, గౌస్ లు కోపం పెంచుకున్నారు. ఈ నేప‌థ్యంలో శ‌నివారం సాయంత్ర నాంప‌ల్లిలోని ఎస్సీ కాల‌నీలో కొబ్బ‌రి బోండాల క‌త్తితో ఇర్పాన్, గౌస్ ఇద్ద‌రు స‌ద్దాం త‌ల నిరికారు. ఆ త‌ల‌తో పాటు నేరుగా నాంప‌ల్లి పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి లొంగిపోయారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.