ర‌జ‌నీకి మురుగ‌దాస్ బిస్కెట్

Star Director To Direct Rajinikanth Back to Back?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్- ఏ.ఆర్ ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ లో ద‌ర్బార్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి  తెలిసిందే. ఇప్ప‌టికే ఈ కాంబినేష‌న్ పై త‌మిల‌నాట‌ భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ప్ర‌చార చిత్రాలు అంచ‌నాల్ని పెంచాయి.  ఈ ద్వ‌యం ఎలాంటి క‌థాంశంతో రాబోతున్నారు అన్న ఆస‌క్తి అభిమానుల్లో నెల‌కొంది. తాజాగా చెన్న‌య్ లో జ‌రిగిన ద‌ర్బార్ ఆడియో వేడుక లో ద‌ర్శ‌కుడు మురగ‌దాస్ సూప‌ర్ స్టార్ ని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

నాకు ఊహ తెలిసి మా ఊరి థియేట‌ర్ లో చూసిన సినిమా ర‌జ‌నీకాంత్ గారిదే. ఇప్పుడు ఆయ‌న తో నేను సినిమా చేయ‌డం  సంతోషంగా ఉంది. ఆయ‌న మ‌న‌కు దేవుడిచ్చిన‌ వ‌రం.  దేవుడిని న‌మ్మిన వాడు క‌ష్ట‌ప‌డతాడు. నిజాయితీగా ఉంటాడు అని న‌మ్మే వారిలో ఆయ‌న ఒక‌రు. ఆయ‌న్ని చూసి ఎన్నో విష‌యాలు తెలుసుకున్నాను. ఆయ‌న జీవితమే ఓ పెద్ద నౌక‌. ఆ నౌక‌లో నాది ఏడాది జ‌ర్నీ. ఇది నాకెంతో గ‌ర్వ‌కార‌ణం. ఇలాంటి అవ‌కాశం మ‌ళ్లీ రావాల‌ని కోరుకుంటున్నా. గ‌త 15 ఏళ్ల‌లో ర‌జ‌నీకాంత్ గారిని ప్రేక్ష‌కులు చూడ‌న‌వి విధంగా యాక్ష‌న్ స‌న్నివేశాలుంటాయ‌న్నారు. ఇది ఓ స‌స్పెన్స్  థ్రిల్ల‌ర్. అన్నీ అంశాలున్న చిత్రమ‌ని అన్నారు. ద‌ర్బార్ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న రిలీజ్ కానుంది. తెలుగు నాట స‌రైన ప్ర‌మోష‌న్ లేక‌పోవ‌డం ర‌జ‌నీ అభిమానుల‌కు నిరాశ‌నే మిగులుస్తోంది.