మణిశర్మ కి మల్టీస్టారర్ ఆఫర్

ఒక్క 15 ఏళ్లు వెన‌క్కి వెళ్తే తెలుగు ఇండ‌స్ట్రీలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ అంటే ఒక్క‌రి పేరే బాగా వినిపించేది. ఆయ‌నే మ‌ణిశ‌ర్మ‌. కొన్నేళ్ల పాటు మ‌రే సంగీత ద‌ర్శ‌కుడు చేయ‌నంత బిజీగా సినిమాలు చేసాడు మ‌ణి. ఇప్పుడంటే దేవీ శ్రీ ప్ర‌సాద్.. థ‌మ‌న్.. అనిరుధ్.. వీళ్ళంతా క‌నిపిస్తున్నారు కానీ ఒక‌ప్పుడు అన్నీ ఆయ‌నే. కోటి, ఎస్ ఏ రాజ్ కుమార్ త‌రం త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీ సంగీత ప్ర‌పంచాన్ని ప‌దేళ్ల పాటు మ‌కుటం లేని మ‌హారాజులా ఏలాడు మ‌ణిశ‌ర్మ‌. చిరంజీవి నుంచి రామ్ చ‌ర‌ణ్ వ‌ర‌కు.. బాల‌య్య నుంచి ఎన్టీఆర్ వ‌ర‌కు.. నాగార్జున నుంచి అఖిల్ వ‌ర‌కు అంద‌రు హీరోల‌తోనూ ప‌ని చేసిన ఘ‌నత మ‌ణిశ‌ర్మ‌కే ద‌క్కుతుంది. ప‌దేళ్ల టైమ్ లోనే 100 సినిమాల‌కు పైగా మ్యూజిక్ ఇచ్చాడు మ‌ణిశ‌ర్మ‌. ఎన్నో సినిమాల‌ను త‌న మ్యూజిక్ తో నిల‌బెట్టిన మ‌ణి.. ఈ మ‌ధ్య పూర్వ‌పు ఫామ్ చూపించలేక‌పోయాడు. 2012లో వ‌చ్చిన ర‌చ్చ త‌ర్వాత మ‌ణిశ‌ర్మ కెరీర్ లో మ‌రో హిట్ లేదు. మ‌రోవైపు మ్యూజిక్ లో కూడా గ‌త స్థాయి క‌నిపించ‌లేదు. దాంతో మ‌ణిశ‌ర్మ కెరీర్ ఇక పూర్తైపోయిన‌ట్లే అనుకున్నారంతా.

దీనికి త‌గ్గ‌ట్లే ఆఫ‌ర్ ల కోసం వేచి చూడ‌కుండా టెంప‌ర్, సీత‌మ్మ వాకిట్లో, అఖిల్ లాంటి సినిమాల‌కు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు మ‌ణి. ఇలాంటి టైమ్ లో ఇప్పుడు త‌న‌లో ఇంకా ప‌స త‌గ్గ‌లేద‌ని గ‌తేడాది జెంటిల్ మ‌న్ తో నిరూపించాడు మ‌ణిశ‌ర్మ‌. ఆ సినిమాలో త‌న బ్యాగ్రౌండ్ స్కోర్ తో కేక పెట్టిం చాడు మ‌ణి. చాలా స‌న్నివేశాలు కేవ‌లం మ‌ణిశ‌ర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ వ‌ల్లే హైలైట్ అయ్యాయంటే అతిశ‌యోక్తి కాదు. చిన్నాచిత‌కా హీరోలు ప‌ట్టించుకున్నా.. స్టార్స్ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మ‌ణిశ‌ర్మ మ‌ళ్లీ బ్యాక్ టూ ఫామ్ అన‌డం క‌ష్ట‌మే అనుకున్నారంతా. కానీ నాని-నాగార్జున లాంటి స్టార్స్ న‌టిస్తున్న సినిమాకు మ‌ణిశ‌ర్మ‌నే సంగీత ద‌ర్శ‌కుడిగా తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య‌. ఈ సినిమాతో క‌చ్చితంగా మ‌ళ్లీ తానేంటో నిరూపిస్తా అంటూ కుర్రాళ్ల‌కు స‌వాల్ విసురుతున్నాడు ఈ సీనియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. మ‌రి ఈ సినిమా త‌ర్వాతైనా మ‌ళ్లీ మ‌ణిశ‌ర్మ మున‌ప‌టి జోరు చూపిస్తాడో లేదో చూడాలి..!