మ్యూజిక్ ఎత్తేసి మ‌ళ్లీ ఆయ‌న‌కే ఇచ్చాడు

Last Updated on by

మ‌ణిశ‌ర్మ.. ప‌దేళ్ల కింద ఈయ‌న పేరు ఓ సంచ‌ల‌నం. తెలుగులో ఈయన త‌ప్ప ఇంకో మ్యూజిక్ డైరెక్ట‌ర్ లేడా అనేలా కుమ్మేసాడు. కానీ ఇప్పుడు కాలం మారింది.. ట్రెండ్ మారింది.. దాంతో కొత్త కొత్త సంగీత ద‌ర్శ‌కులు స‌త్తా చూపిస్తున్నారు. దాంతో మ‌ణిశ‌ర్మ ఖాళీ అయిపోయాడు. ఇప్ప‌టికీ ఈయ‌న‌పై ఉన్న గౌర‌వ‌మో.. న‌మ్మ‌కమో తెలియ‌దు కానీ కొంద‌రు ద‌ర్శ‌కులు.. హీరోలు మాత్రం మ‌ణిశ‌ర్మ‌కు అవ‌కాశం ఇస్తున్నారు. తాజాగా క‌ళ్యాణ్ రామ్ హీరోగా వ‌చ్చిన ఎమ్మెల్యే సినిమాకు కూడా ఈయ‌నే సంగీతం అందించాడు. ఈ సినిమాలో మ‌ణిశ‌ర్మ త‌న మార్క్ మ్యూజిక్ ను అందించాడు. అంటే సూప‌ర్ అని కాదు.. మ‌ళ్లీ ఎప్ప‌ట్లాగే రొటీన్ మ్యూజిక్ ఇచ్చాడ‌ని.

పాటల విష‌యంలో ఓకే కానీ ఆర్ఆర్ ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి పూర్తిగా పాత సినిమాల్లోని రీ రికార్డింగ్ అలాగే దించేసాడు మ‌ణిశ‌ర్మ‌. క‌ళ్యాణ్ రామ్ సినిమా కాబ‌ట్టి క‌ళ్యాణ్ రామ్ క‌త్తి.. అత‌నొక్క‌డే లాంటి సినిమాల నుంచి ఆర్ఆర్ ఎత్తేసి మ‌ళ్లీ ఆయ‌న‌కే ఇచ్చాడు మ‌ణిశ‌ర్మ‌. దాంతో సినిమా చూస్తున్న‌పుడే మ‌ణిశ‌ర్మ ఏ మూడ్ లో సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడో అర్థ‌మైపోయింది. ఈ మ‌ధ్యే క‌ళ్యాణ్ రామే చెప్పాడు. మ‌ణిశ‌ర్మ గురించి మాట్లాడే స్థాయి త‌న‌కు లేద‌ని.. ఆయ‌న మంచి మూడ్ లో ఉన్న‌పుడు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో.. లేన‌పుడు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో రెండూ నాకు తెలుసు. నా సినిమాల‌కు కూడా అదే జ‌రిగింద‌ని చెప్పాడు క‌ళ్యాణ్. మ‌రి ఎమ్మెల్యేకు ఏ మూడ్ లో ఉన్న‌పుడు ఇచ్చాడో క‌ళ్యాణ్ రామ్ కే తెలియాలిక‌..!

User Comments