కాపీ ట్యూన్స్ నా త‌ప్పా?

Last Updated on by

యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌పై కొన్ని సీరియ‌స్ విమ‌ర్శ‌లు ఉన్నాయి. అత‌డు కాపీ స్వ‌రాల్ని అందిస్తాడ‌ని, వేరొక చోటి నుంచి బాణీలు లేపేస్తాడ‌ని ఇదివ‌ర‌కూ విమ‌ర్శ‌కులు తీవ్రంగానే అత‌డిని టార్గెట్ చేశారు. దీనిపై ఓ ఇంట‌ర్వ్యూలో త‌మ‌న్ చాలా సీరియ‌స్ అయ్యార‌ని తెలుస్తోంది.

కాపీ ట్యూన్లు ఇస్తాన‌ని ఎలా చెబుతారు.. చూస్తూ ఊరుకుంటానా? నాక్కూడా టైమొస్తుంది.. అని సీరియ‌స్ అయ్యార‌ట‌. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఏం అడిగితే అది ఇవ్వ‌డ‌మే మా ప‌ని. క‌థ‌ని బ‌ట్టి, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల అభిరుచిని బ‌ట్టే ట్యూన్లు ఇస్తాను. అభిరుచి లేని వారికి అలాంటి ట్యూన్లే పుడతాయ‌ని అన్నారని క్రిటిక్స్‌లో చ‌ర్చ సాగ‌డం విశేషం. ఇక‌పోతే త‌న‌ని కాపీ క్యాట్ అన్న‌వాళ్ల‌కు మునుముందు స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు స‌రైన ఆన్స‌ర్ ఇస్తాన‌ని అన్నార‌ట‌. అయితే థ‌మ‌న్ ఒక్క‌డే కాపీ చేస్తున్నాడా? అంటే టాలీవుడ్‌లో మ్యూజిక్ మొత్తం కాపీ క్యాట్ మ్యూజిక్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్క‌డో వినేసిన‌ట్టే తెలిసిపోయే మ్యూజిక్ మాత్ర‌మే ఇక్క‌డ విన‌గలం. ఇదే విష‌యంపై ఓసారి ప్ర‌సాద్ లాబ్స్ లో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో ఇళ‌య‌రాజా సైతం క్లారిటీనిచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కొంద‌రు పొయ్యిపై పెనం పెట్టాక దినుసులు వెతుక్కునే ప్ర‌య‌త్నం చేస్తారు. ఈలోగానే పెనం మాడిపోతుంద‌ని అన్నారు. నిజ‌మే … ఆయ‌న అన్న‌ట్టు ట్యూన్ క్రియేట్ చేసే ముందు వేరే ట్యూన్లు వినాల‌నుకుంటేనే కొంప‌లు అంటుకునేది. ముందు ఆ ప‌ని మానేసి సొంతంగా ట్యూన్స్ కట్ట‌డం ఎలానో నేర్చుకోవాలి మ‌నోళ్లు!!

User Comments