థ‌మ‌న్ స‌వాల్ ఎన్టీఆర్ సినిమా కోసం

Last Updated on by

అవును.. నిజంగానే ఇప్పుడు త‌న విశ్వ‌రూపం చూపించ‌డానికి రెడీ అవుతున్నాడు థ‌మ‌న్. ఈయ‌న ఇప్పుడు చాలా మారిపోయాడు. మొన్న‌టి వ‌ర‌కు థ‌మ‌న్ పాట‌లంటే ప్రేక్ష‌కుల‌కు ఓ ర‌క‌మైన బోర్ ఫీలింగ్ వ‌చ్చేవి. ఎప్పుడూ ఒకే మ్యూజిక్ ఇస్తాడ‌నే విమ‌ర్శ‌లు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు మ‌నోడిలో ఏదో తెలియ‌ని మార్పు క‌నిపిస్తుంది. ఎందుకో తెలియ‌ని ఫ్రెష్ నెస్ వ‌చ్చేసింది. తొలిప్రేమ నుంచి ఎందుకో తెలియ‌దు కానీ థ‌మ‌న్ చాలా మారిపోయాడు. ఆ సినిమాలో అన్ని పాట‌ల‌కు మంచి ట్యూన్స్ ఇచ్చాడు థ‌మ‌న్. ఇక మొన్న విడుద‌లైన ఛ‌ల్ మోహ‌న్ రంగా టీజ‌ర్ కు కూడా మంచి స్పంద‌న వ‌చ్చింది. అందులో తొలిపాట బాగుంది. ఇలాంటి స‌మ‌యంలోనే త్రివిక్ర‌మ్- ఎన్టీఆర్ సినిమాకు సంగీతం అందించే అవ‌కాశం అందుకున్నాడు థ‌మ‌న్. ఈ కాంబినేష‌న్ పై ముందు భ‌యాలున్నా కూడా ఇప్పుడు ధైర్యంగా ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

ఎన్టీఆర్ ఫ్యాన్ ఒక‌రు ఆతృత ఆపుకోలేక థ‌మ‌న్ నే నేరుగా ట్విట్ట‌ర్ లో అడిగేసాడు. భ‌య్యా ఇక‌పై కూడా ఇలాగే కొత్త సంగీతం ఇస్తారా అని.. దానికి మ‌నోడు చాలా పాజిటివ్ గా స్పందించాడు. గుర్తు పెట్టుకో భ‌య్యా.. ఇప్ప‌ట్నుంచీ అన్నీ నువ్వు గుర్తు పెట్టుకుంటావ్. మోష‌న్ పోస్ట‌ర్ తోనే నా స‌త్తా ఏంటో చూస్తావ్ అంటూ స‌వాల్ విసిరాడు. ఇందులో స‌వాల్ కంటే కూడా ఎన్టీఆర్ సినిమాను తానెంత ప్ర‌స్టేజియ‌స్ గా తీసుకుంటున్నానో చెప్ప‌క‌నే చెప్పాడు థ‌మ‌న్. ఆయ‌న నుంచి అభిమానులు కోరుకునేది కూడా ఇదే. ఎప్పుడూ అదే రొటీన్ మ్యూజిక్ ఇవ్వ‌కుండా అప్పుడప్పుడూ ఇలా కొత్త‌గా కూడా ఉంటే అంత‌కంటే కావాల్సిందేముంది..? థ‌మ‌న్ ఇలా కొత్త మ్యూజిక్ ఇచ్చాడంటే అంతా ఆయ‌న్నే కావాల‌నుకుంటారు కూడా. ఎందుకంటే దేవి కంటే ఎప్పుడూ స‌ర‌స‌మైన ధ‌ర‌ల్లో ఉంటాడు కాబ‌ట్టి. మ‌రి.. ఫ్యూచ‌ర్ ఎలా ఉండ‌బోతుందో..?

User Comments