ఇప్పుడు నువ్వే తోపు రాజా..!

Last Updated on by

కాపీ క్యాట్ అంటారు.. సేమ్ మ్యూజిక్ మ‌ళ్లీ మ‌ళ్లీ ఇస్తాడంటారు.. ప‌క్కోడి ట్యూన్స్ ప‌ట్టుకొస్తాడంటారు.. హాలీవుడ్ నుంచి కాపీ చేస్తాడంటారు.. ఒక్క మ్యూజిక్ డైరెక్ట‌ర్ పై ఇన్ని అలిగేష‌న్స్ ఉండ‌టం మాత్రం ఎక్క‌డా జ‌ర‌గ‌దు. కానీ ఇవ‌న్నీ ఒక్క థ‌మ‌న్ పైనే ఉంటాయి. కానీ అదే థ‌మ‌న్ కావాలంటూ ద‌ర్శ‌క నిర్మాత‌లంతా వెంట ప‌డుతుంటారు. ఇదే ఎవ‌రికీ అర్థం కాని విష‌యం. ఎందుకు థ‌మ‌న్ అంటే అంత ప్రేమ చూపిస్తుంటారో అర్థం కాదు. 2018 మొద‌లై నెల అయిందో లేదో ఇప్ప‌టికే ఈ ఏడాది మూడు సినిమాలు విడుద‌ల చేసాడు థ‌మ‌న్. ఇప్పుడు మ‌రో మూడు సినిమాలతో వ‌స్తున్నాడు. ఇప్పుడు ఈయ‌న కోసం ఓ రేర్ రికార్డ్ వేచి చూస్తుంది. ఫిబ్ర‌వ‌రి 9, 10న రాబోయే అన్ని సినిమాల‌కు థ‌మ‌నే సంగీత ద‌ర్శ‌కుడు. ఆ రెండు రోజుల్లో మూడు సినిమాలు వ‌స్తున్నాయి. అన్నింటికీ త‌న‌దైన మ్యూజిక్ ఇచ్చాడు థ‌మ‌న్.

ఇప్ప‌టికే ఇంటిలిజెంట్ లోని ఛ‌మ‌క్ ఛ‌మ‌క్ రీమిక్స్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక మిగిలిన పాట‌ల‌కు ఓకే అనే టాక్ వ‌చ్చింది. మోహ‌న్ బాబు గాయ‌త్రిలోని పాట‌లు పెద్ద‌గా క్లిక్ కాలేదు కానీ ఆర్ఆర్ అదిరిపోయింది. ట్రైల‌ర్ లోనే ఈ విష‌యం అర్థ‌మైపోయింది. ఇక తొలిప్రేమ పాట‌ల‌కు మాత్రం రెస్పాన్స్ అదిరిపోయింది. చాలా రోజుల త‌ర్వాత థ‌మ‌న్ నుంచి ఫ్రెష్ మ్యూజిక్ వ‌చ్చింద‌ని అంతా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. వ‌రుణ్ తేజ్ కెరీర్ లోనే తొలిప్రేమ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇందులోని అల్ల‌సాని వారి ప‌ద్య‌మా పాట అయితే ఇప్ప‌టికే సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిపోయింది. ఇలా ఒకే వారం మూడు సినిమాలు వ‌స్తుంటే.. అన్నింటికీ థ‌మ‌నే సంగీతం అందించ‌డం మాత్రం నిజంగా అద్భుత‌మైన రికార్డే. ఇది ఇప్ప‌ట్లో ఎవ‌రూ ఛేదించ‌లేని రికార్డ్ కూడా.

User Comments