యంగ్ బ్యూటీని ఏడిపించిన బాలయ్య..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో నటిస్తోన్న ‘పైసా వసూల్’ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో టీజర్, ప్రోమో లతో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు హీరోయిన్స్ ను కూడా రంగంలోకి దించుతుంది. ఈ మేరకు ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న యంగ్ బ్యూటీ ముస్కాన్ తాజాగా చిత్ర విశేషాలను, హీరో బాలయ్యతో తన అనుభవాలను మీడియాతో పంచుకుంది. ఆ స్టోరీలోకి వెళితే, పైసా వసూల్ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటిస్తుండగా.. తనకు చెల్లెలిగా, అచ్చ తెలుగు అమ్మాయిగా, ఒక టీనేజ్ యువతిగా ముస్కాన్ నటిస్తుందట.
దీనికోసం ముందుగా పూరీ ఆడిషన్ నిర్వహించినపుడు ఈ కుర్ర భామకు కొన్ని కఠినమైన సీన్స్ ను ఇచ్చాడట. అయినా కష్టపడి చేసి మెప్పించడంతో పూరీ ఛాన్స్ ఇచ్చాడని చెబుతుండటం గమనార్హం. ఇదే సమయంలో హీరో బాలకృష్ణ గారితో ఎదురైనా కొన్ని మధురమైన క్షణాల గురించి ముస్కాన్ చెబుతూ.. బాలయ్య బాబు నన్ను చాలా ఆటపట్టించే వారని, అప్పుడప్పుడూ సరదాగా ఏడిపించేవారని, సెట్స్ లో కొంచెం అల్లరి చేసేవారని తెలిపింది. అంతేకాకుండా బాలయ్య చాలా మంచి నటుడని, వ్యక్తిత్వంలో కూడా ఆయన చాలా మంచివారని ఓ రేంజ్ లో ఆకాశానికి ఎత్తేసింది. చివరగా ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగుంటుందని చెప్పిన ముస్కాన్.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాను చాలా బాగా తీశారని పేర్కొంది. మరి ఈ లెక్కన పైసా వసూల్ తో ఈ కుర్ర హీరోయిన్ కు ఏమాత్రం కలిసొస్తుందో చూడాలి. ముఖ్యంగా బాలయ్య, శ్రియ శరన్ లాంటి సీనియర్స్ వెనుక ఉండి ఏమైనా ప్రభావం చూపిస్తుందేమో చూడాలి.