అమ్మ ఆశీస్సులు నా బ‌లం- మ‌హేష్‌

Last Updated on by

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌కి త‌న మాతృమూర్తి ఇందిర అంటే ప్రాణం. డాడ్ కృష్ణ రోజూ మూడు కాల్షీట్ల‌తో క్ష‌ణం తీరిక లేకుండా షూటింగుల్లోనే గ‌డిపే రోజుల్లో త‌న‌కు అన్నీ తానే అయ్యి చూసుకున్న‌ది త‌న మాతృమూర్తి. అమ్మ‌తోనే త‌న‌కు ఎక్కువ అనుబంధం. అందుకే త‌న లైఫ్‌ ప్ర‌తి మూవ్‌మెంట్‌లో మాతృమూర్తిని గుర్తు చేసుకుంటాడు మ‌హేష్‌. ఇటీవ‌లే `భ‌ర‌త్ అనే నేను` స‌క్సెస్ సాధించిన‌ప్పుడు.. త‌న‌కు అమ్మ ఆశీస్సులు బ‌లంగా ఉండ‌డం వ‌ల్ల‌నే ఈ విజ‌యం ద‌క్కింద‌ని అన్నాడు. అస‌లు ఆ సినిమాని రిలీజ్ చేసింది అమ్మ సెంటిమెంటుతోనే. ఇందిర‌మ్మ పుట్టిన‌రోజు అయిన ఏప్రిల్ 20న ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు.

నేడు మాతృదినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని మ‌రోసారి ట్విట్ట‌ర్‌లో త‌న త‌ల్లి ఫోటోని, అలానే మాష్ట‌ర్ గౌత‌మ్‌, బేబి సితార‌తో న‌మ్ర‌త ఫోటోని పోస్ట్ చేసి… నాకు, నా పిల్ల‌ల‌కు అమ్మే బ‌లం.. అని వ్యాఖ్యను పోస్ట్ చేశాడు. అంటే త‌న ఎదుగుద‌ల‌కు కార‌ణ‌మైన అమ్మ‌ను, అలానే త‌న పిల్ల‌ల ఎదుగుద‌ల‌కు కార‌ణం అయిన న‌మ్ర‌త‌ను ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నాడు మ‌హేష్‌. మాతృదినోత్స‌వం సంద‌ర్భంగా ఆ ఇద్ద‌రు మాతృశ్రీ‌ల‌కు అరుదైన కానుక ఇది.

User Comments