వీడియో: మ‌హేష్‌తో ఆయ‌నెందుకు?

Last Updated on by

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ న‌టించిన `భ‌ర‌త్ అనే నేను` సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇంటా బ‌య‌టా రికార్డ్ వ‌సూళ్లు సాధించింది. ఇప్ప‌టికే 161 కోట్ల గ్రాస్‌, 100 కోట్ల షేర్ అంటూ డివివి సంస్థ వివ‌రాలందించింది. అమెరికా స‌హా ఓవ‌ర్సీస్ నుంచి 31 కోట్లు ఖాతాలో వేసుకున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఆ క్ర‌మంలోనే ఈ ఆనందాన్ని దేవుళ్ల‌తో, ప్రేక్ష‌క‌దేవుళ్ల‌తో పంచుకునేందుకు మ‌హేష్ అన్ని కీల‌క న‌గ‌రాల్ని చుట్టేస్తున్నారు. నిన్న అమ‌రావ‌తి, బెజ‌వాడ వంతు. ఈరోజు తిరుప‌తి – తిరుమ‌ల వంతు. నిన్న దుర్గ‌మ్మ‌ను సంద‌ర్శించుకున్న మ‌హేష్‌, నేడు తిరుమ‌లేశుని ద‌ర్శించుకున్నాడు. మామ గ‌ల్లా తోడు రాగా, కొర‌టాలా స‌మేతుడై సామివారిని సంద‌ర్శించుకున్నాడు మ‌హేష్‌. ఆ క్ర‌మంలోనే అక్క‌డో స్పెష‌ల్ ఎస్కార్ట్ ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డంపై వాడి వేడి చ‌ర్చా సాగుతోంది.

మ‌హేష్ చుట్టూ వ‌ల వేసినట్టు మెగా నిర్మాత‌ ఎన్వీ ప్ర‌సాద్ దైవ‌స‌న్నిధానంలో మ‌హేష్ చెంత ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఆయ‌నేంటి ఇక్క‌డ‌? `స్పైడ‌ర్` ఫ్లాపైనా ఇంకో ఛాన్స్ ప్లీజ్ అని అంటున్నాడా? అంటూ ప్ర‌శ్న త‌లెత్తింది. తిరుప‌తి-చిత్తూరు డిస్ట్రిబ్యూట‌ర్‌గా, టాలీవుడ్ అగ్ర నిర్మాత‌గా ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌ గుర్తింపు ఉంది. కాబ‌ట్టి సూప‌ర్‌స్టార్లు, స్టారాధిస్టార్లు ఆయ‌న‌కు కాల్షీట్లు ఇవ్వ‌డం ఏమంత క‌ష్ట‌మేమీ కాదు. మొత్తానికి సామివారిని, మ‌హేష్‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఆయన చూపించిన గౌర‌వం, ప్రేమాభిమానాలు హైలైట్ అయ్యాయి వీడియోల్లో. చూద్దాం.. స్పైడ‌ర్ త‌ర‌వాత ఎన్వీకి మ‌రో ఛాన్స్ ఉందేమో! ఇక మ‌హేష్‌- అశ్వ‌నిద‌త్‌- దిల్‌రాజు కాంబినేష‌న్ సినిమాకి స‌న్నాహాలు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

User Comments