గాలికి తిరిగే బేవార్స్ స్టోరి

Last Updated on by

న‌ట‌శిక్ష‌కుడు భిక్షు వ‌ద్ద శిక్ష‌ణ పొందిన ఎంద‌రో న‌టీన‌టులు స్టార్లు అయ్యారు. ఇప్పుడు అదే కోవ‌లో మ‌రో కుర్రాడు వ‌స్తున్నాడు. అత‌డే మ‌హీధ‌ర్‌. అత‌డు న‌టించిన `నా ల‌వ్ స్టోరి` ఈనెల 29న రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ చాలా సంగ‌తులే ముచ్చ‌టించాడు.

మ‌హీధ‌ర్ మాట్లాడుతూ-“యాక్టింగ్ బిక్షు గారి ద‌గ్గ‌ర నేర్చుకున్నా. మా అమ్మ గారు ప‌బ్లిష‌ర్ అవ‌డం వ‌ల్ల రైట‌ర్స్, డైర‌క్ట‌ర్స్ తో ఇంట‌రాక్ట్ అవుతూ ఉంటారు. అలా డైర‌క్ట‌ర్ శివ గారితో ప‌రిచ‌యం అయ్యారు. ఆయ‌న నాకు క‌థ చెప్ప‌డం, నాకు చేయాల‌నిపించ‌డం, నేను యాక్టింగ్ కోర్సు చేశాన‌ని ఆయ‌న న‌న్ను న‌మ్మి క‌థ‌ను సెట్స్ మీద‌కు తీసుకెళ్ల‌డం చాలా ఫాస్ట్ గా అయిపోయిందంతా. నా ల‌వ్‌స్టోరీ.. ఆస‌క్తిక‌ర‌మైన క‌థే. ప్ర‌స్తుతం స‌మాజంలో ప్ర‌తీ అబ్బాయీ ఎదుర్కొంటున్న స‌మ‌స్య గురించిన సినిమా. వ‌య‌సు మీద పడుతున్న పెళ్లి కాక‌పోవ‌డం, అక్క‌డి నుంచి ఆ అబ్బాయికి ఒక అమ్మాయి ప‌రిచ‌య‌మ‌వడం, ఆ త‌ర్వాత ఒక క్యూట్ ల‌వ్ స్టోరీ. ల‌వ్ స్టోరీ ఎలా స‌క్సెస్ అయింది అన్న దాని మీద క‌థ న‌డుస్తూంటుంది. ఉద్యోగం లేకుండా లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ తిరుగుతూండే పాత్ర నాది“ అఈని చెప్పాడు.

User Comments