నా నువ్వే ఆడియో రివ్యూ

Last Updated on by

క‌ళ్యాణ్ రామ్, త‌మ‌న్నా జంట‌గా జ‌యేంద్ర తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం నా నువ్వే. ఈ చిత్ర పాట‌లు విడుద‌ల‌య్యాయి. మ‌ళ‌యాల సంగీత ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ ఈ చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇక ఈ చిత్రానికి పిసి శ్రీ‌రామ్ సినిమాటోగ్రాఫీ అందిస్తుండ‌టం విశేషం. ఈ చిత్రంలోని పాట‌ల‌కు రెస్పాన్స్ బాగానే వ‌స్తుంది. మ‌రి ఇందులో పాట‌లు ఎలా ఉన్నాయి..? ఏయే పాట ఎలా ఉంది.. మాస్ ను మెప్పించే పెప్పీస్ ఉన్నాయా లేదా అనేది చూద్దాం..!

నా నువ్వేలో మొత్తం ఏడు పాట‌లున్నాయి. అందులో మూడు పాట‌లు రొమాంటిక్ వేలో సాగితే.. ఒక‌టి ప్రేమ‌ను విర‌హ‌గీతంలా మార్చేసాడు ద‌ర్శ‌కుడు. ఇక ఒక‌టి పెప్పీ నెంబ‌ర్.. మ‌రోటి ఫోన్ రింగ్ టోన్స్ ను వాడుకుంటూ చేసిన ట్యూన్. ముందుగా హే హే ఐ ల‌వ్ యూ అంటే సాగే పాట రెండుసార్లు వ‌స్తుంది ఆల్బ‌మ్ లో. ఒక‌టి హీరో.. మ‌రోటి హీరోయిన్ వ‌ర్ష‌న్. ఈ రెండు పాట‌లు బాగానే ఉన్నాయి. కానీ అంత ఈజీగా విన‌గానే ఎక్కే ట్యూన్స్ అయితే కావు. విన‌గా విన‌గా న‌చ్చే అవ‌కాశాలున్నాయి. ఇక రంగ‌మ్మ మంగ‌మ్మ ఫేమ్ ఎంఎం మాన‌సి పాడిన నిజ‌మా మ‌న‌సా పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. రొమాంటిక్ వేలో సాగిన ఈ పాట క్యాచీగా ఉంది.

రైట్ రైట్ రైట్ అంటూ టిప్పు పాడిన పాట ఫాస్ట్ బీట్. దీనికి క్యాచీ ట్యూన్స్ ఇచ్చాడు సంగీత ద‌ర్శ‌కుడు శ‌ర‌త్. అయితే ఇది విన‌డానికి కంటే కూడా విజువ‌ల్ గా బాగుంటుందేమో చూడాలి. మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ‌ర‌త్ కూడా ఈ చిత్రంలో ఓ పాట పాడాడు. ప్రేమికా అంటూ ఆయ‌న పాడిన పాట హై పిచ్ లో ఉంది. విర‌హ‌గీతంలా ఉండే ఈ పాట కూడా ప‌ర్లేదు. ఇక చిన్నిచిన్ని అంటూ సాగే పాట ఇప్ప‌టికే విడుద‌లైంది. దీనికి రెస్పాన్స్ బాగానే ఉంది. దానికితోడు నా నువ్వే టైటిల్ సాంగ్ చాలా స్లోగా ఉంది. ఇందులో రెండు మూడు పాట‌లు మాత్రం విన‌డానికి బాగున్నాయి. కానీ మొత్తం ఆల్బ‌మ్ మాత్రం సినిమా విడుద‌లైన త‌ర్వాత కానీ క్లిక్ అయ్యేలా క‌నిపించ‌డం లేదు. విజువ‌ల్ గా వ‌ర్క‌వుట్ అయితే పాట‌లు బాగున్న‌ట్లే..!

User Comments