కళ్యాణ్ ను ఫ్రెష్ గా చూపించిన మహేష్

Last Updated on by

క‌ళ్యాణ్ రామ్ అంటే ఇన్నాళ్లూ ఓ ఇమేజ్ ఉండేది. ఆయ‌న కేవ‌లం మాస్ సినిమాలే చేస్తాడు.. యాక్ష‌న్ సినిమాల‌తో కాలం గ‌డిపేస్తాడు అని. మొన్న వ‌చ్చిన ఎమ్మెల్యే కూడా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమానే. కానీ ఇప్పుడు తొలిసారి కెరీర్ లో ప్రేమ‌క‌థ చేస్తున్నాడు క‌ళ్యాణ్. పూర్తిగా ల‌వ్ స్టోరీ.. ఇది ఆయ‌న‌కు కూడా కొత్త‌గా అనిపించి ఉంటుంది. ఇప్పుడు చూసే ప్రేక్ష‌కులకు కూడా కొత్త‌గానే ఉంటుంది. నా నువ్వే ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో కళ్యాణ్ రామ్ ను చూస్తుంటే అస‌లు ఇన్నాళ్లూ మ‌నం చూసిన నంద‌మూరి హీరో ఈయ‌నేనా అనే అనుమానం వ‌స్తుంది. అంత ఫ్రెష్ గా ఉన్నాడు ఈ చిత్రంలో.

ఇక త‌మ‌న్నా కూడా చాలా క్యూట్ గా ఉంది. సొంత డ‌బ్బింగ్ కూడా చెప్పుకుంది. దానికితోడు ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. పీసీ శ్రీ‌రామ్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మ‌రింత బ‌లాన్నిస్తుంది. 180 త‌ర్వాత చాలా ఏళ్ల గ్యాప్ తీసుకుని ఈ చిత్రం తెర‌కెక్కించాడు జ‌యేంద్ర‌. ఆ క‌ష్టం ఇందులో క‌నిపిస్తుంది. నా నువ్వే ఖచ్చితంగా క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లో డిఫెరెంట్ సినిమాగా నిలిచిపోవ‌డం ఖాయం. ఈ చిత్రంతో త‌న‌లోని మ‌రో కోణాన్ని ప్రేక్ష‌కుల‌కు చూపించబోతున్నాడు నంద‌మూరి ప‌టాస్. కళ్యాణ్ రామ్ ను చాలా కొత్త చూపించాడు నిర్మాత మహేష్ కోనేరు. మే 25న విడుద‌ల కానుంది ఈ చిత్రం. మ‌రి.. నా నువ్వేతో క‌ళ్యాణ్ రామ్ ఏం చేస్తాడో..?

User Comments