బ‌న్నీ భ‌లే మారిపోయాడే..

ఈ మ‌ధ్య సినిమా సినిమాకు ఒక‌లా మారిపోతున్నాడు అల్లుఅర్జున్. క్యారెక్ట‌ర్ ఎలా డిమాండ్ చేస్తే అలా మారిపోతున్నాడు. ద‌ర్శ‌కుల ఇష్టాన్ని కాద‌న‌లేక త‌న‌ను తాను మార్చుకుంటున్నాడు. ఇప్పుడు కూడా అలాగే మారిపోయాడు మ‌రోసారి. ప్ర‌స్తుతం ఈయ‌న నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియాలో న‌టిస్తున్నాడు. వ‌క్కంతం వంశీ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో మిల‌ట‌రీ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు బ‌న్నీ. మిల‌టరీ అంటే మాట‌లు కాదు. ఇష్ట‌మొచ్చిన‌ట్లు స్టైల్ గా ఉంటానంటే కుద‌ర‌దు. దానికి ఓ ప‌ద్ద‌తి ఉంటుంది. హెయిర్ స్టైల్ నుంచి బాడీ స్ట్ర‌క్చ‌ర్ వ‌ర‌కు అన్నీ ఓ లెక్క ప్ర‌కార‌మే ఉంటాయి. ఇప్పుడు బ‌న్నీ కూడా దానికి త‌గ్గ‌ట్లుగా మారిపోయాడు. తాజాగా స‌మంత‌-చైతూ రిసెప్ష‌న్ కు వ‌చ్చిన బ‌న్నీని చూసి షాక‌య్యారంతా. షార్ట్ హెయిర్ స్టైల్ తో కొత్త‌గా క‌నిపించాడు అల్లుఅర్జున్.

నా పేరు సూర్య షూటింగ్ మొన్న‌టి వ‌ర‌కు ఊటీలో జ‌రిగింది. ఇప్పుడు హైద‌రాబాద్ లోని కొన్ని షాపింగ్ మాల్స్ లో జ‌రుగుతుంది. వ‌క్కంతం వంశీ ప‌నితీరుపై చాలా సంతృప్తిగా ఉన్నాడు బ‌న్నీ. తొలి సినిమా అయినా కూడా ద‌ర్శ‌క‌త్వంలో ఎలాంటి పొర‌పాట్లు జ‌ర‌క్కుండా.. చాలా ఓపిగ్గా చేస్తున్నాడంటూ ఈయ‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నాడు. ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్ తో క‌లిసి నాగ‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అను ఎమ్మాన్యువ‌ల్ హీరోయిన్. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుద‌ల కానుంది నా పేరు సూర్య‌. డిజేతో యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిపోయిన బ‌న్నీ.. నా పేరు సూర్య‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి త‌న స‌త్తా నిరూపించుకోవాల‌ని చూస్తున్నాడు.