బ‌న్నీ ఇర‌గ‌దీసాడండోయ్..!

Last Updated on by

బ‌న్నీ అంటే ముందుగా గుర్తొచ్చేది డాన్సులే. కానీ డిజేలో అవి క‌రువ‌య్యాయి. ఎందుకో తెలియ‌దు కానీ డిజేలో డాన్సులు పెద్ద‌గా చేయ‌లేదు బ‌న్నీ. ఆ సినిమా అంతా స్లో మూవెంట్స్ తోనే నెట్టుకొచ్చేసాడు. బాక్సు బ‌ద్ద‌లైపోద్ది లాంటి ఫాస్ట్ బీట్స్ కు కూడా స్లో స్టెప్స్ వేసాడు. కానీ ఇప్పుడు నా పేరు సూర్య సినిమాతో మ‌ళ్లీ లైన్ లోకి వ‌చ్చేసాడు అల్లు వార‌బ్బాయి. ఈ చిత్రంలో మ‌ళ్లీ ఫాస్ట్ మూవ్స్ తో ర‌చ్చ చేయ‌డానికి రెడీ అయిపోయాడు. ఇందులో డాన్స్ ఎలా ఉండ‌బోతుందో ఇప్పుడే చిన్న హింట్ ఇచ్చాడు బ‌న్నీ. తాజాగా విడుద‌లైన ఇరగ ఇర‌గ పాట చూస్తుంటే రేపు థియేట‌ర్స్ లో ఇర‌గ‌దీయ‌డం ఖాయం అని అర్థ‌మైపోతుంది. అను ఎమ్మాన్యువ‌ల్ అందాల‌తో పాటు నోట్లో చుట్ట పెట్టుకుని బ‌న్నీ వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. మొత్తానికి మే 4న సినిమా విడుద‌ల కానుండ‌టంతో మెల్ల‌గా ప్ర‌మోష‌న్ లో వేగం పెంచేస్తున్నారు చిత్ర‌యూనిట్. విశాల్ శేఖ‌ర్ నా పేరు సూర్య‌కు సంగీతం అందించారు.

User Comments