దేవ‌దాస్ సీక్వెల్ ప్లాన్‌

Last Updated on by

కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం నానితో క‌లిసి `దేవ‌దాస్` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ్.. దేవ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. నాని.. దాస్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆ రెండిటిని క‌లిపి దేవ‌దాస్ అని కింగ్ స్వ‌యంగా వెల్ల‌డించారు. దేవ‌దాస్ పూర్తి ఎంట‌ర్‌టైన‌ర్‌. నాని చాలా ప్ర‌తిభావంతుడైన న‌టుడు. త‌న‌తో ప‌నిచేయ‌డం అద్భుతంగా ఉంది. ఈ సినిమా హిట్ అయితే సీక్వెల్ కూడా చేస్తామ‌ని నాగ్ తెలిపారు.

ఇక బాలీవుడ్ రీఎంట్రీ గురించి నాగ్ మాట్లాడుతూ .. నేను బాలీవుడ్‌కి వెళ్ల‌లేదు. బాలీవుడ్ వాళ్లే నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. హిందీ సినిమా చేసి 15 ఏళ్లు అవుతుంది. మంచి అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌క వేరే భాష‌ల్లో చేస్తాన‌ని అన్నారు కింగ్ నాగార్జున‌. మేన‌ల్లుడు సుశాంత్ హీరోగా రాహుల్ ద‌ర్శ‌క‌త్వ ం వ‌హించిన‌ చి.ల‌.సౌ ఈ నెల 3న రిలీజ‌వుతున్న సంద‌ర్భ ంగా అన్న‌పూర్ణ ఏడెక‌రాల్లో జ‌రిగిన పాత్రికేయ స‌మావేశంలో నాగార్జున మాట్లాడుతూ ఈ వివ‌రాలందించారు.

User Comments