చైతూ.. క‌న్ఫ్యూజ‌న్ క‌న్ఫ్యూజ‌న్..!

Last Updated on by

సినిమాలు లేక‌పోతే కాదు.. ఒక్కోసారి సినిమాలు ఎక్కువైనా కూడా ఏం చేయాలో తెలియ‌ని క‌న్ఫ్యూజ‌న్ లో ఉంటారు. ఇప్పుడు నాగ‌చైన‌త్య‌కు కూడా ఇదే జ‌రుగుతుంది. ఈయ‌న ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడో.. ఏది ముందు విడుద‌ల అవుతుందో ఆయ‌న‌కు కూడా తెలియ‌ట్లేదు. అప్పుడెప్పుడో ఏడాది కింద చందూమొండేటితో స‌వ్య‌సాచి మొద‌లుపెట్టాడు. ఇప్ప‌టికే షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. అది సెట్స్ పై ఉండ‌గానే మారుతితో శైలజారెడ్డి అల్లుడు మొద‌లు పెట్టాడు. ఇప్పుడు ఈ చిత్రం కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. స‌వ్య‌సాచి ముందు విడుద‌ల కావాల్సి ఉన్నా అల్లుడు స్పీడ్ చూసి ఆ సినిమాను కొన్నాళ్లు ఆపాల్సి వ‌స్తుంది.

ఏది ముందు తీసుకురావాల‌నే విష‌యంలో చైతూ కూడా క‌న్ఫ్యూజ‌న్ లోనే ఉన్నాడు. త్వ‌ర‌లోనే స‌వ్య‌సాచి, శైల‌జారెడ్డి అల్లుడు ఫ‌స్ట్ కాపీలు సిద్ధ‌మ‌వుతాయి. అవి చూసిన త‌ర్వాత ఏది ఎప్పుడు విడుద‌ల చేయాలో నిర్ణ‌యం తీసుకుంటాం అంటున్నాడు చైతూ. ఇప్పుడున్న స‌మాచారం ప్ర‌కారం అయితే ముందు మారుతి సినిమా విడుద‌ల చేసిన త‌ర్వాత స‌వ్య‌సాచిని సెప్టెంబ‌ర్ లో కానీ.. అక్టోబ‌ర్ లో కానీ విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు నాగ‌చైత‌న్య‌. ఈ రెండు సినిమాల‌తో పాటు బాబీతో వెంకీమామ‌.. శివ నిర్వాణ‌తో ఓ సినిమా కూడా క‌మిట‌య్యాడు ఈ హీరో. మ‌రి వీటిలో ఏది ఎప్పుడు వ‌స్తుందో ఈయ‌న‌కే తెలియాలిక‌..!

User Comments