టీజ‌ర్ టీజ‌ర్‌కి గిఫ్ట్ ఇస్తారాబ్బా!

శేఖ‌ర్ క‌మ్ముల మేజిక్ ఎలా ఉంటుందో ఆయ‌న `ఆనంద్` నుంచి చూస్తూనే ఉన్నాం. మంచి కాఫీలాంటి సినిమా అంటూ ఆ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాడు. ఆ త‌ర్వాత నుంచి ప్ర‌తి సినిమాకీ ఓ కొత్త రుచిని పంచుతూనే ఉన్నాడు. ఆయ‌న ప్రేమ‌క‌థ‌లు తీయడంలో దిట్ట‌. వాటిలో మూమెంట్స్ ప్ర‌తి ఒక్క‌రినీ హ‌త్తుకునేలా ఉంటాయి. తాజాగా `ల‌వ్‌స్టోరీ` టీజ‌ర్‌తో ఆ విష‌యం మ‌రోమారు అర్థ‌మైంది. నిజానికి ఇది టీజ‌ర్ కూడా కాదు.

Sekhar Kammula

ఒక నిమిషంపాటు సాగే ఓ మ్యూజిక‌ల్ వీడియో. అంత చిన్న వీడియోలోనే త‌న‌దైన మేజిక్‌ని ప్ర‌ద‌ర్శించాడు. శేఖ‌ర్ క‌మ్ముల స‌ర్‌… శేఖ‌ర్ క‌మ్ముల అంతే అని అంద‌రూ మెచ్చుకున్నారు ఆ వీడియోని చూసి. ముద్దు పెట్టుకుంటే ఏడుస్తారాబ్బా అని క్యూట్ క్యూట్‌గా హీరోయిన్ సాయిప‌ల్ల‌వితో చెప్పించ‌డం చూసి అంతా ఫిదా అయిపోయారు. ఆ మ్యూజికల్ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ హీరో నాగ‌చైత‌న్య‌ని మ‌రింతగా సంతోషపెట్టింది. దాంతో ఆయ‌న ఈ రోజు చిత్రీక‌ర‌ణ‌కి వ‌స్తూ వ‌స్తూ శేఖ‌ర్ క‌మ్ముల‌కి ఓ గిఫ్ట్ తీసుకొచ్చాడు. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా… క‌ళ్ల‌ద్దాలు. ఖ‌రీదైన ఆ క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని తెగ మురిసిపోయాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. థ్యాంక్యూ చైతూ… మ‌రో టీజ‌ర్‌కి మ‌రో గిఫ్ట్ రెడీ చేసుకో అంటూ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. మ‌రి చైతూ నిజంగానే టీజ‌ర్ టీజ‌ర్‌కి ఒక గిఫ్ట్ ఇస్తాడేమో చూడాలి. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న `ల‌వ్‌స్టోరీ` ఈ వేస‌విలోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.